తిరుపతిలో గ్యాంగ్ వార్.. నలుగురికి తీవ్ర గాయాలు

తిరుపతిలో హోం స్టే నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ శుక్రవారం (ఏప్రిల్ 4) అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ వార్ సంచలనం సృష్టించింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రెండు స్టే హోంల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కర్రలు రాళ్లతో హోంస్టేల నిర్వాహకులు ఘర్షణకు తలపడ్డారు. ఈ ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

ఈ గ్యాంగ్ వార్ కు కారణమేంటంటే.. ఒక స్టేహోంకు వచ్చే వారిని మరో స్టేహోం వారు బలవంతంగా లాక్కు వెడుతున్నారంటూ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే   డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోం స్టే యాజమాన్యం దాడికి దిగింది. ఈ  దాడిలో డెక్కన్ సూట్స్ హోం స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డి లు గాయపడ్డారు.

వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ స్టే హోంల నిర్వాహకుల మధ్య జరిగిన ఈ ఘర్షణతో స్థానికులు, శ్రీవారి భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసిన  పోలీసులు వారిని విచారిస్తున్నారు.