కళకళలాడే యాలకులు...

 

యాలకుల టీ ఘుమఘుమలాడుతూ ఎంత రుచిగా ఉంటుందో కదా! అసలు ఇలాయిచికి ఉండే రుచే వేరబ్బా. స్వీట్ ఏదైనా సరే దానితో ఇలాయిచి పౌడర్ కలిస్తే చాలు దాని రుచి రెండింతలవుతుంది. పాయసంలో, టీలో, కిళ్ళీ లో, లడ్డూలో ఇలా చెప్పుకుంటూ పోతే దాని రుచి మాత్రం కంపల్సరిగా అన్నిటిలో ఉండాల్సిందే కదా.

కేవలం రుచి కోసం మాత్రమే ఈ యాలకులు వాడతారు అనుకుంటే మాత్రం ముమ్మాటికి పొరపాటు పడ్డట్టే. ఇందులో విశేష ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా మన డైజేస్టివ్ సిస్టంకి ఇది ఎంతో మేలు చేస్తుంది. నోటి దుర్వాసన, ఇండైజిషన్, వోమిటింగ్స్ ఇలాంటి వాటిని కూడా దూరం చెయ్యగలదు.

 

యాలకుల నుంచి వచ్చే నూనే కూడా  అద్భుతాలు చెయ్యగలదు. అరోమా థెరఫీలో దీనికో ప్రత్యెక స్థానం ఉందిట. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ నూనే రాస్తే సెప్టిక్ కాకుండా కాపాడే గుణాలు ఉన్నాయని చెప్తున్నారు పరిశోధకులు. ఈ నూనే వాసన పీలిస్తే చాలు అలసట తగ్గటమే కాకుండా మంచి రిలీఫ్ వస్తుందిట. ఇది త్రోట్ ఇన్ఫెక్షన్ కి కూడా మంచి మందుగా పనిచేస్తుంది. ఇంకా ఇంకా ఈ యాలకులని దేనికి వాడచ్చో చూద్దామా.


*  పిల్లలలో వచ్చే కడుపునొప్పి,ఇండైజిషన్ కి వాముతో పాటు యాలకులు వాడచ్చు.

*  యాలకులు కషాయంలా చేసి నోట్లో పుక్కలిస్తే దంతాలు,చిగుళ్ళ బాధలు తగ్గుతాయట.

*  తినే ఆహార పదార్థాల పైన యాలకుల నూనే చల్లితే పిల్లలకు మంచిదని చైనీయులు విశ్వసిస్తారు.

*  యాలకుల ద్వారా కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుందిట.

*  వీటిని పొడి చేసి ఆ పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళ మీదున్న ఎలాంటి మరకలనైనా పోగొట్టి తళతళ మెరిసేలా చేస్తుందిట.

చూసేందుకు చిన్నగా తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పువ్వుల్లా కనిపించే యాలకులు అందించే లాభాలు ఎన్నో, అందుకే అనాలి వాహ్ ఇలాయిచి వాహ్!

-కళ్యాణి