యువతీ,యువకులు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ మేరకు ఫ్యాషన్ డిజైనర్లు వారి కోసం కొత్త ఫ్యాషన్ వస్త్రాలు, యాక్ససరీస్‌ను సృష్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో యూత్ కోసం ప్రత్యేకంగా మొత్తం జిప్‌లతోనే వస్త్రాలను తయారుచేస్తున్నారు. ఈ డ్రెస్సులతో ఎలా కావాలంటే అలా క్షణాల్లో మారిపోవచ్చు.
ఈ జిప్పర్ డ్రెస్సు ప్రత్యేకత ఏంటంటే.. డ్రెస్సు ఒక్కటే అయినప్పటికీ, దీనిని పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎలాగంటే నైట్‌డ్రెస్ దగ్గర్నుంచీ బెల్ట్ దాకా అలాగే లాంగ్ కోటుగా, మినీ స్కర్టుగా, స్లీవ్‌లెస్‌గా ఎలాగైనా వాడుకోవచ్చు. ఒక్క డ్రెస్సును వందరకాలుగా వాడడం సాధ్యమేనా అని ఆలోచించకండి. ఈ జిప్పర్‌లో అమర్చిన 120 జిప్‌ల సాయంతో దాన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. బెల్టు దగ్గర పూర్తి స్థాయిలో వేసుకునే వస్త్రాలుగా, మనకు కావాల్సిన విధంగా మలచుకోవచ్చు. మధ్యలోకి ఉన్న జిప్‌ను పూర్తిగా తీసివేసి నట్టయితే అది రెండుగా విడిపోతుంది. ఒక దాన్ని మినీ స్కర్టుగా, మరో దాన్ని టాప్‌గా వేసుకుని ఎంచక్కా పార్టీ లకు వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ఈ జిప్పర్ డ్రెస్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.