ముఖానికి తగ్గట్టు బొట్టు పెట్టుకోవడం ద్వారా ప్రత్యేక అందం చేకూరుతుంది.

 

వెడల్పు నుదురున్న స్త్రీలు పెద్దబొట్లు, చిన్న నుదురున్న స్త్రీలు చిన్న బొట్లు పెట్టుకోవాలి. పొడవు ముఖం వున్న స్త్రీలు మధ్యరకపు బొట్లు పెట్టుకుంటే అందంగా కన్పిస్తారు.

అలాగే మీరు మ్యాచింగ్ చీర, బ్లౌజ్ ధరిస్తే చీర రంగు బొట్టు పెట్టుకోండి. దుస్తులకు మ్యాచింగ్ అయ్యే స్టిక్కర్ బొట్టు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

జీన్స్ మాక్సీ, స్కర్ట్స్ వగైరా మోడరన్ దుస్తులు ధరించినపుడు బొట్టు పెట్టుకోవద్దు. లైట్ కలర్ స్టిక్కర్స్ వంటివి ధరిస్తే బాగుంతుంది.

లిప్‌స్టిక్, బొట్టురంగు ఒకే రంగులో వుంటే చూడటానికి బాగుండదు. రెడ్, లైట్‌రెడ్ కలర్ స్టిక్కర్ బొట్లు అన్ని వయసుల స్త్రీలకు అందాన్నిస్తాయి.

ప్రతిసారి కొత్త బొట్టును ధరించండి. ఒక బొట్టును ఎక్కువసార్లు ఉపయోగించవద్దు.

బొట్టుపెట్టుకుని తీసిన స్థలంలో పాలు, మీగడతో తుడవండి. ఎప్పుడూ మంచి కంపెనీ బొట్టులను మాత్రమే ధరించండి.

సంప్రదాయమైన ఫంక్షన్ లాంటి వాటికి వెళ్ళినపుడు కుంకుమ లాంటివి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.