మెరిసే చర్మానికి విటమిన్ E
మెరిసే చర్మం స్వంతం కావాలంటే... 'విటమిన్ ఇ' ని అందించే ఆహారాన్ని తీసుకోవలంటున్నారు నిపుణులు. సాధారణంగా అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో 'విటమిన్ ఇ' ని వాడతారు. ఎందుకంటే చర్మానికి హానిచేసే ప్రిరాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు మిగతా వాటితో పోలిస్తే 'విటమిన్ ఇ' లో అత్యధికంగా ఉంటాయి. ఆహరం ద్వారా కూడా మన శరీరానికి అందించగలిగితే మంచిది అంటున్నారు నిపుణులు.
పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పులు, పాలకూరలో బాగా, టమాటో, బొప్పాయి, ఆలివ్ నూనే వంటి వాటితో తగినంత 'విటమిన్ ఇ' మనకి లభ్యమవుతాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మెరిసే చర్మ స్వంతమవటం ఖాయం.
- రమ