Home » Baby Care » చలికాలంలో చేసే ఈ ఒక్క మిస్టేక్ పసిబిడ్డల ప్రాణాలు తీస్తాయ్..!

చలికాలంలో చేసే ఈ ఒక్క మిస్టేక్ పసిబిడ్డల ప్రాణాలు తీస్తాయ్..!

బేబీ కేర్* చలికాలంలో చేసే ఈ ఒక్క మిస్టేక్ పసిబిడ్డల ప్రాణాలు తీస్తాయ్..!


చలికాలం అనగానే చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.  చలి తీవ్రతకు పెద్దలే వణికిపోతుంటారు. ఇక చిన్న పిల్లలకు చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఈ చలికాలం. ఎందుకంటే చిన్నపిల్లలకు త్వరగా జలుబు వస్తుంది.  దీని వల్ల తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో తల్లిదండ్రులు పసిపిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో పిల్లలను  ఇన్ఫెక్షన్ల నుండి  రక్షించుకోవాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల పసిపిల్లలు నిద్రలోనే మరణించే అవకాశం కూడా  ఉంటంది.  చిన్న పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే..


చలికాలంలో చిన్నపిల్లలకు జాగ్రత్తలు..

చలికాలంలో  ముందుగా పిల్లల తల,  కాళ్ళను టోపీ,  సాక్స్ తో కవర్ చేయాలి. గది ఉష్ణోగ్రతను కొద్దిగా వెచ్చగా ఉంచాలి. నిద్రపోయేటప్పుడు పిల్లలపై దుప్పటి వేయకూడదు. ఇది SIDS (సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్) ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో SIDS మరణానికి ఇలా దుప్పటి కప్పడం  ఒక సాధారణ కారణమని వైద్యులు చెబుతున్నారు.అలాగే స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని వాడాలి. అంతేకాదు.. ఎక్కువసేపు నీటిలో ఉంచి స్నానం చేయించకూడదు.

ఇన్పెక్షన్ రాకుండా ఉండాలంటే..

పిల్లలు పుట్టిన తర్వాత మొదటి వారాలలో ఎక్కువ మందిని ఇంటిని రాకుండా చూసుకోవాలి. వీలైనంత తక్కువ మంది ఉంటే మంచిది.

పిల్లవాడిని ఎత్తుకునే ముందు  చేతులను బాగా కడుక్కోవడం తప్పనిసరి చేయాలి.  తల్లిదండ్రులే కాదు.. పిల్లలను ఎవరు ఎత్తుకున్నా.. ఎత్తుకునే ముందు చేతులు బాగా కడుక్కోమని చెప్పాలి.


జలుబు లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నవారిని పిల్లల నుండి దూరంగా ఉంచాలి.  లేకపోతే పిల్లలకు ఇన్పెక్షన్ వస్తుంది

పిల్లలు  నిద్రపోయే, ఆడుకునే,  తినే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి.

పిల్లల ఆరోగ్యం కోసం వేసే అన్ని రకాల టీకాలను సరైన సమయంలో వేయించాలి.  పిల్లలకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.

ఈ లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలి..

పిల్లలు శ్వాస తీసుకోవడానికి చాలా వేగంగా లేదా శ్రమతో కూడిన శ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతుంటే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.

పాలు తాగడానికి నిరాకరిస్తున్నా  లేదా చాలా తక్కువ పాలు తాగుతున్నా వైద్యుడిని సంప్రదించాలి

జ్వరం లేదా  జలుబు ఎక్కువగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా వేద్యుడిని సంప్రదించాలి.

పిల్లలు సరిగా స్పందించకపోవడం,  వారిలో చలనం సరిగా లేకపోవడం వంటివి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

చర్మం  రంగు మారడం  లేదా  పాలిపోయినట్లు అనిపించడం వంటివి జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  

పిల్లల విషయంలో ఎప్పుడూ సొంతవైద్యం లేదా నిర్గక్ష్యం, పాత మందులు వాడటం వంటివి చేయకూడదు. ఇది పిల్లల ప్రాణాలను బలితీసుకోవచ్చు.  

                                 *రూపశ్రీ.

google-banner