జుట్టు అందంగా, వత్తుగా పెరగాలంటే

 

 

చక్కగా ఉండే జుట్టు అందమే వేరు. అందంగా ఆరోగ్యంగా ఉండే తల కట్టు స్వంతం కావాలంటే ఏ షాంపు వాడాలి, ఏ నూనె రాయాలి అని ఆలోచిస్తారు కాని ఏం తినాలి అని ఆలోచించారు ఎవరు. అయితే అందమైన ఆరోగ్యమైన జుట్టు కావాలంటే షాంపూలు,,కండీషనర్ లతోపాటు ఆహారం విషయంలో కూడా కొంత శ్రద్ద పెట్టక తప్పాదు అంటున్నారు నిపుణులు. సమతుల,పోషకాహారం, అలాగే కొన్ని ప్రత్యేక వ్యాయామాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయట. మరి ఏ ఏ పోషకాలు మన జుట్టుకు అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయో  చూద్దామా!

ప్రోటీన్లతో పొడవైన జుట్టు :

జుట్టును ఆరోగ్యంగా,బలంగా ఉంచేవి ప్రోటీన్లు ప్రోటీన్లు తగ్గిన కొద్దీ జుట్టు పలచబడిపోతుంది. అందుకు ప్రోటీన్లు సమృద్దిగా ఉండే పాలకూర, క్యాలీఫ్లవర్,కీరా, క్యాప్సికం,టమాటా, వంటి కూరగాయలని రోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే sulfur amino acids కూడా జుట్టు ఒత్తుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. సోయాబీన్స్ ,రాగి,బీట్రూట్,నువ్వులు, అరటి,, ఖర్జూరం, ద్రాక్షా, కోడిగుడ్డు ల నుంచి ఈ సల్ఫర్ అమినో ఆమ్లాలు పుష్కలంగా దొరుకుతాయి.

 

సిల్కీ హెయిర్ కి విటమిన్స్ :



జుట్టు సిల్కీగా, మెరుస్తూ కావాలంటే ఆకుకూరలు,నారింజ, అన్ని రకాల కూరగాయలు, రోజువారీ, ఆహారంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి విటమిన్ ఎ ని అందిస్తాయి. అలాగే చికెన్, పాలకూర, నారింజ, బెండ, బీట్రూట్, గోదుమలు కూడా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫోలిక్ యాసిడ్,బీ- 12 లు అధికంగా ఉంటాయి. ఇక అటుకులు, రాగులు, వేరుశెనగ, బాదాములు,పాలు , పాల ఉత్పత్తుల నుంచి  ఇనుము, జింక్ లభిస్తాయి. ఇవి జుట్టును రాలిపోకుండా చేస్తాయి.ఇలా జుట్టుకు ఏ ఆహారం కావాలో తెలుసుకుని తింటే చాలు పట్టుకుచ్చులాంటి జుట్టు స్వంతం అవుతుంది.

- రమ.