శరీర సౌందర్య చిట్కాలు

* ముఖం, శరీరం నిగనిగలాడుతూ ఉండాలంటే ప్రతిరోజు ఉసిరికాయ తినాలి.

ఉసిరిక శరీరానికీ నునుపు మాత్రమే కాదు మెరుపు కూడా ఇస్తుంది.

 

* చర్మం చిట్లి బిరుసెక్కినట్లుగా ఉంటే శరీరానికి పెరుగు రాసి, అరగంట ఆగి

స్నానం చేయండి. ఆ భాద నుండి విముక్తి కలుగుతుంది.

 

* చర్మం మీది ముడతలు పోవాలంటే కొద్ది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం

చేమంతి పూవులతో సున్నితంగా మర్థన చేయాలి.

 

* జుట్టు నిగనిగలాడుతూ మెరవాలంటే కోడిగ్రుడ్డులో సోనను మరియు అరటి పండును బాగా కలిపి, ఆ పేస్టును పావుగంట ఆగి శుభ్రంగా తలస్నానం చేయాలి.

 

* మీ పెదాలు తరచుగ ఎండిపోవడం గాని పగలడంకాని జరిగితే పాలమీగడను సఫ్రాన్ పేస్టులో కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు పూయాలి. ఈ విదంగా వారం

పదిరోజులు చేస్తే మీ పెదాలు గులాభీ రంగులోకి అందంగా మారుతాయి.

 

* అంటుకుపోయిన పిల్లల జుట్టు విడిపోవాలంటే, అక్కడ కొంచం ఆలివ్ ఆయిల్ని

రాసి, పావుగంట తర్వాత పొడి బట్టతో తుడవండి.

 

* పిల్లలికి సున్నిపిండి వాడితే చర్మవ్యాధులు రాకుండా వుండడమే కాకుండా,

శరీరంమీద వుండే నూగులాంటి వెంట్రుకలు కూడా పోతాయి.

 

* జుట్టు బిరుసుగా ఉండి వెనకకు దువ్వడానికి వీలులేకుండా ఉంటే నీళ్ళలో

కొంచం నిమ్మరసం కలిపి తలకి రాసి దువ్వండి.

 

* తేనె, నిమ్మరసం, గ్లిసిరిన్లో కలిపి రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసి

మర్థన చేస్తే పెదాల నల్లదనం పోతుంది గులాభీ రంగులోకి మారి అందంగా

కనిపిస్తాయి.

 

* ఒక బాగం ఆపిల్ జ్యూస్, మూడు భాగాల నీరు కలిపి తలకి రాసి ఆరిన

తరువాత తల స్నానం చేస్తే ఎరుపు రంగులోని జుట్టు నల్లగా మారడమే కాకుండా

వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

 

* పెదాలపైన మచ్చలు పోవాలంటే గ్లిసిరిన్ లో కొంచం రోజ్ వాటర్ కలిపి దానిని

పెదాలకు మర్థన చేయాలి.

* పేలినచోట గంధం అరగదీసి రాస్తే మంట, దురద తగ్గి హాయిగా ఉంటుంది.

 

* ఎండబెట్టిన పుదీనా ఆకుల్ని పొడిచేసి, తగినంత నీరు కలిపి బాగా కాచి, చల్లార్చిన

కషాయాన్ని ప్రతిరోజూ పుక్కిలబడితే నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం

కారటం నివారించవచ్చు.

 

* నిమ్మరసం నీటిలో పిండి, ఆ నీటిలో చేతులు ముంచితే మృదువుగా మారతాయి.