సమంతా అందానికి కారణం.....

 


వయసు ముప్పై దాటబోతున్నా ఇంకా అందాలబొమ్మలా కనిపించే సమంతా అంత స్లిమ్ గా, యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతోంది అని చాల మందికే సందేహం రావచ్చు. ఏం మాయ చేసావే అని కుర్రకారు ఇప్పటికి పాటలు పాడటం ఆపట్లేదు. అలాంటి సమంతా అందానికి రహస్యం  ఏంటో తెలుసుకుందామా.


సమంతా రోజు ఉదయం లేవగానే ముందుగా చేసే పని ఎక్సర్సైజ్. తన ఫిట్నెస్ మాస్టర్ రాజేష్ సూచనల మేరకు శరీరానికి తగిన విధంగా వ్యాయామం ఎంచుకుని క్రమం తప్పకుండా చేస్తుందిట. లేవగానే ఇలా చేయటం అలవాటుగా మారిపోయి చెయ్యకపోతే అస్సలు తోచదని చెప్తోంది. షూటింగ్ కోసం వేరే ఊర్లు తిరిగే సమయంలో జిమ్ కి  వెళ్ళటం కురరదు కాబట్టి అలాంటి సమయాల్లో జాగింగ్ చేస్తుందిట.

 


మనిషి శరీరంలోంచి ఎంత చెమట బైటకి పోతే అంత మంచిదని చెప్తున్న సమంతా రోజులో కనీసం అరగంట సేపైనా ఎక్సర్సైజ్ చేస్తుందిట. తను తినే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, తృణధాన్యాలు, పాలు, పళ్ళు ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఎక్కువగా సాంబార్ అన్నం అంటే ఇష్టపడే తనకి ఎక్కడ లావుగా అయిపోతానో అనే బెంగే లేదట. తమిళ అమ్మాయి  అయిన తనకి దానికి తగ్గట్టుగానే దోస, ఇడ్లి, పొంగలి ఇలాంటివన్నీ చాలా ఇష్టం. డైటింగ్ అనేది ఇష్టపడని తను ఏది ఇష్టమనిపిస్తే అది తింటుందిట. ఎంత తిన్న దానికి తగ్గ పని చేస్తే చాలని తన అభిప్రాయం.


బయటకి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా సన్ స్క్రీన్ లోషన్ తీసుకెళుతుంది  సమంతా. ఎక్కువగా షూటింగ్స్ లో ఉన్నప్పుడు తనని  ఎండ నుంచి రక్షించే ఏకైక సాధనం ఈ సన్ స్క్రీన్ అని చెప్తోంది.


శరీరంలో మృదుత్వం పోకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్ళు, కొబ్బరి బొండాలు తాగుతుంది. ఎక్కువగా వదులుగా ఉండే బట్టలని ఇష్టపడని తనకి చీర కట్టుకోవటం ఇష్టమట. అందరు ఆడవాళ్లు  వాళ్ళు ఎలా ఉన్నారా అని పదేపదే అనుకుంటారు కాని ఒక మనిషిలో చూడాల్సింది అందం కాదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మనసుని అని చెప్తోంది తను.


...కళ్యాణి