1ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. ఆకలి మందగించినప్పుడు మిరియాల పొడిలో నెయ్యి కలిపి మొదటి ముద్దలో తీసుకొంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది.
ఎదిగే పిల్లలకు ఎముక పుష్టిగా ఉండేందుకు గ్లాసు పాలలో చెంచా నెయ్యి వేసి తాగిస్తే మంచిది.
అరటి పండు గుజ్జులో, కాసిని పాలు, కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే అవయవాలు దృఢంగా అవుతాయి. బరువు పెరుగుతారు.
పసి పిల్లలకు నెయ్యి లేదా వెన్నను ఒంటికి రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తే చర్మం మృదువుగా మారుతుంది.
క్షయవ్యాధి, మలబద్ధకం, విరేచనాలు, జ్వరంతో బాధపడేవారు, వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండాలి.