మొటిమల నివారణ
* ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. వీక్లీ 3 సార్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* జాజికాయను నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని మొటిమలకు రాస్తే మొటిమలు తగ్గుతాయి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
* మొటిమలు ఒక్కోసారి బాగా నొప్పిని కలిగిస్తాయి అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ మొటిమలు వున్నప్రాంతంలో పెట్టాలి, నొప్పి కొంచం వరకు తగ్గుతుంది.
* పుదీనా ఆకుల రసం కూడా మొటిమల నివారణకు పనిచేస్తుంది.
* కొంచెం నీటిలో దాల్చిన చెక్కపొడి వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది
* టమోటా పండు రసం తీసి మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
* కొంచెం నిమ్మరసంలో వేపాకుపొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమలు నుండి విముక్తి వుంటుంది .
* బొప్పాయి పండు గుజ్జులో రెండు చుక్కల తేనే , కొంచం పాలమీగడ కలిపి ముఖానికి పూతలా వేయాలి. పూర్తిగా ఆరిపోయాక కడిగేసుకోవాలి.
* తులసిఆకుల రసం కూడా మొటిమలకు బాగా పనిచేస్తుంది.
* బయటనుంచి వచ్చినపుడు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. బయటకి తీసుకునే జాగ్రత్తల కన్నా ఆహరంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.
* నాన్ వెజ్ తగ్గించాలి, మసాలాలూ ఫ్రై లు తగ్గించాలి.
* ఒక్కోసారి మనలో టెన్షన్స్ కూడా మొటిమలకు కారణం కావచ్చు