గుడ్డు తింటే ఆరోగ్యం అని తెలుసు కానీ అందానికి కూడా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. అందుకే కొన్ని టిప్స్ మీకోసం.
రెండు టీ స్పూన్ల గుడ్డు సొనలో ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్ , ఒక స్పూన్ నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి . పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి . దీని వల్ల చర్మం మెత్తగా, కాంతివంతంగా తయారవుతుంది.
చేతులకు వాక్సింగ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూను గుడ్డు సొనలో ఒక టీ స్పూన్ తేనె కలిపి చేతులకు రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. దీనివల్ల చర్మంపైన ఉన్న బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి.
జుట్టు మెత్తగా ఉండటానికి కూడా గుడ్డు సొన బాగా ఉపయోగపడుతుంది . హెన్నలో గుడ్డు సొన కలిపి పట్టుకుంటే జుట్టుకి మంచి కండీషనర్ గా ఉంటుంది .