* కీరదోస రసానికి ముఖం పై వుండే మొటిమలు,మచ్చలు ను దూరం చేసే గుణం వుంది. రోజుకాకపోయిన కనీసం వారానికి రెండు 3 సార్లు రాస్తే మంచి ఫలితం వుంటుంది.
* టమాట రసం ముఖానికి రాస్తే ముఖం కాంతివంతం గా తయారైతుంది.
* పెసర పిండిలో గంధం కలిపి రాత్రి పూట పడుకోబోయే ముందు ముఖానికి పూసుకుంటూ వస్తే ముఖం మీద నల్లటి మచ్చలు మటుమాయమవుతాయి.
* స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ రాసుకుని తర్వాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది.
* రెండు చెంచాల కీరరసానికి చెంచా పాలు, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే, మృతచర్మం తొలగిపోతుంది.
* పుదీనా ఆకులు నూరి రాత్రిపూట ముఖానికి రాసుకుని పొద్దుటే గోరువెచ్చటి నీటితో కడుక్కుంటూ ఉంటే మొటిమలు, మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి.