చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే క్రీంలు, ప్యాక్ లాంటివి వాడకుండ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి అవేమిటో ఒకసారి చూద్దామా...!

పండ్లు, కూరగాయలు లాంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండేవి తినాలి. B12, విటమిన్ E, ఇనుము వంటి పోషకాలు ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మంలో సహజ నూనెలు ఉత్పత్తి అవుతాయి. అదే విధంగా ఆరు బయట కనీసం అరగంట వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి చర్మకణాలు ఆరోగ్యంగా మారుతాయి. అదే విధంగా రసాయనాలు తక్కువగా ఉండే క్లెన్సర్ ని ఎంచుకుని రోజుకు రెండు సార్లు చర్మాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిర్జీవంగా మారకుండా ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.