ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజుకు మూడు లేదా నాలుగు పుట్టగొడుగులు ఆహారంలో ఉండేలా చూసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్‌ D పుష్కలంగా తీసుకోవాలి. ఈ విటమిన్‌ D చాలా తక్కువ ఆహార పదార్ధాల్లో లభిస్తుంది.

మనకు చాలినంత విటమిన్‌ D లభించాలంటే చక్కగా పుట్టగొడుగులు తీసుకుంటే చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో విటమిన్‌ D పుష్కలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే డి విటమిన్‌ లోపంతో బాధపడేవారు పుట్టగొడుగులను తీసుకుంటే మేలని చెబుతున్నారు.

మనిషి రోజంతా చాలా చురుగ్గా ఉండడానికి పది మైక్రోగ్రాముల డి విటమిన్‌ అవసరమని, ఈమేర డి విటమిన్‌ మూడు, నాలుగు పుట్టగొడుగుల్లో లభిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.