ఈ మధ్య విస్ కౌన్సిల్ వర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారట.. అందులో "అమ్మ" పవర్ ఎంతో మరోసారి తేలిందట.

 

అదేనండి మనకి ఏ మాత్రం బాధ కలిగినా మొట్టమొదట నోట్లోంచి వచ్చే మాట "అమ్మ" అనే కదా! నిజానికి అసంకల్పితంగా మనమా మాట అన్నా కూడా ఆ పదానికి ఉన్న పవర్ మనల్ని ఊరట పరుస్తుందట.

 

మనసుకి బాధ కలిగిన క్షణంలో "అమ్మ" అంటూ అమ్మతో అన్ని చెప్పుకున్నట్టు మనసులో చెప్పినా, అమ్మ ఫోటో చూసినా ఎంతో మానసిక స్వాంతన కలుగుతుండటం గమనించారట పరిశోధకులు.

 

"అమ్మ"తో కలిసి ఉండే పిల్లలు మానసికంగా ధైర్యవంతులుగా ఉంటారని అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోలనలలో వున్నప్పుడు అమ్మ దగ్గర ఓ పాడి నిముషాలు కూచుంటే చాలట.

 

అది వీలు కాకపోతే ఫోన్ లో అమ్మ గొంతు విన్నా ఒత్తిడి, ఆందోళనల స్థాయి తగ్గటం గుర్తించారు పరిశోధకులు. 80% యూత్ పిల్లల విషయంలో "అమ్మ" ఔషధంగా ఉపయోగపడుతుందంటున్నారు. కాబట్టి ఎప్పుడూ, ఏ మాత్రం ఒత్తిడిగా అనిపించినా అమ్మ, అమ్మ ఫోటో, లేదా అమ్మ గొంతు మనకి వరంగా ఉపయోగపడుతున్నాయన్నమాట.

 

-రమ