ఆడవాళ్ళ అలంకరణలో డ్రెస్సులు, చెప్పులు, లిప్ స్టిక్ లు వంటివే కాకుండా హెయిర్ స్టైల్ ను మరింత అందంగా చూపించే హెయిర్ బ్యాండ్ లకు కూడా మరింత క్రేజ్ పెరిగింది. డ్రెస్సులకు, హెయిర్ స్టైల్ లకు తగ్గట్లుగా రకరకాల మోడల్స్ తో, స్టైల్ లతో ఆదరగొడుతున్నాయి. హెయిర్ బ్యాండ్, రిబ్బన్లు ఇప్పుడు కొత్త తరహాలో లభిస్తున్నాయి. పెద్ద వారికోసమే కాకుండా పిల్లల కోసం కూడా ప్రత్యేకమైన హెయిర్ బ్యాండ్ లు లభిస్తున్నాయి.
హెయిర్ బ్యాండ్ తలపై భాగాన ధరిస్తే స్పోర్టివ్‌గా వుంటుంది. దీనికోసం మార్కెట్లో అందమైన రంగుల్లో క్లాత్ కూడా లభిస్తుంది. మరికొన్ని ప్లాస్టిక్ వుండి నాజూకుగా వుంటాయి. గ్రీన్, పర్పుల్ ఇలా ఎవరికి నచ్చిన రంగులను వారు ఎంపిక చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్స్, వేసే వస్త్రధారణ, షూలను బట్టి వుంటుంది. అందమైన, రంగుల హెయిర్ బ్యాండ్స్‌ను ఎన్నిక చేయాలి. పుష్పాలు, సీతాకోకచిలుకలు, రకరకాల ప్రింట్స్ గలవి చూడటానికి ఇంపుగా వుంటాయి.
వాడే దుస్తులను బట్టి హెయిర్ బ్యాండ్స్‌ను మ్యాచ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల లేటెస్ట్ ట్రెండ్ మోడల్ హెయిర్ బ్యాండ్ లు దొరుకుతున్నాయి. వీటి ధర మాములుగా ఇరవై నుండి మొదలుకొని వేల రూపాయల వరకు కూడా లభిస్తున్నాయి. హెయిర్ బ్యాండ్ అనేది ఆడవాళ్ళ అందానికి మరింత సొగసును చేకూరుస్తుంది.
