హస్త ఉత్తాన ఆసనం
బరువు తగ్గడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం చేస్తే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చంటున్నారు యోగా నిపుణులు. మరి ఆ ఆసనం ఎలా చేయాలో వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం !
హస్త ఉత్తాన ఆసనం :
* ఉత్తానమంటే పైకి లేపడం. చేతుల్ని పైకి లేపి చేసే ఆసనం గనుక దీన్ని హస్త ఉత్తాన ఆసనం అన్నారు. రెండు చేతులనూ నిటారుగా ఆకాశమువైపు జతగా సాచి నిదానంగా, నిండుగా ఊపిరిని తీసుకుని లోపల బంధించాలి. ఇదే స్థితిలోనడుము పైభాగము నుంచి అర చేతుల వరకూవున్న శరీరాన్ని వీలైనంత వెనక్కి వంచాలి.
* ఈ స్థితిలో చేతులు, భుజాలు, ఉదర స్థానం బాగా సాగడంవలన అవి పటిష్టంగా తయారవుతాయి. పొట్ట సాగడంవలన జీర్ణ శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులు బలాన్ని పెంచుకుంటాయి. కొవ్వు కరగటం ద్వారా క్రమంగా బరువు తగ్గుతుంది.
* ఈ ఆసనం చేసేటప్పుడు ప్రారంభంలోనే వెన్ను పూర్తిగా వెనక్కి వంచే ప్రయత్నం చేయకూడదు. మొదట్లో కొంతమందికి కళ్ళు తిరిగి చీకట్లు కమ్మి కింద పడే అవకాశం ఉంది. అలా జరిగితే మరోసారి ప్రయత్నించేటప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, కాళ్ళు, పాదాలు తగినంత ఎడంగావుంచి వెన్ను వెనక్కు వంచగలిగే స్థితికి మాత్రమే వంచాలంటున్నారు యోగా నిపుణులు.