ఒత్తైన జుట్టు రహస్యం ఈ ఆయిల్ సొంతం!
అమ్మాలకు ఒత్తైన, పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం. జుట్టు పెరగదు కాబట్టి అలా ఉంటారు కానీ.. అందంగా ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉన్న జుట్టు పెరుగుతుంటే ఎవరు మాత్రం మాకొద్దు అని అంటారు చెప్పండి. నడుము వరకు పొడవాటి మందపాటి జుట్టు కావాలనుకుంటే మంచి హెయిర్ ఆయిల్ వాడాలి. మార్కెట్లలో బోలెడు హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. ఇంత పెద్ద జుట్టు, ఇంత ఒత్తైన జుట్టు అంటూ ఒకటే ప్రమోషన్లు ఊదరగొట్టేస్తాయ్. వాళ్లకు మార్కెట్ పెరుగుతుంది తప్ప.. మీ తలలో జుట్టు కనీసం ఒక ఇంచ్ అయినా పెరగదు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడం కోసం కొంచెం ఓపిక తెచ్చుకుని ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారుచేసుకుంటే..
చాలా చక్కని ఆలోచన కానీ.. యూట్యూబ్ లలో చూపించే బోలెడు చిట్కాల కారణంగా ఈ హెయిర్ ఆయిల్ సొంతంగా తయారుచేసుకోవడంలో కూడా కాస్త కన్ఫ్యూజనే.. అలాంటి కన్ఫ్యూజన్ తప్పించి ఒక క్లారిటీతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకునేవిధానం మీకోసం…
ఈ హెయిర్ ఆయిల్ గురించి చెప్పే ముందు.. అసలు ఇది ఎందుకు వాడాలి. చాలామందికి జుట్టు పలుచగా.. పొట్టిగా ఎందుకు ఉంటుంది?? అనే విషయం కూడా తెలుసుకోవాలి.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రెండు రకాలుగా పోషకాలు అందాలి. ఒకరి ఆహారం ద్వారా కడుపుకు తీసుకోవడం అయితే.. రెండవది బయటి నుండి జుట్టుకు పోషకాలు అందించడం. హెయిర్ ప్యాక్ లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ మసాజ్ ఇవన్నీ జుట్టుకు పోషకాలు అందించేవే.. కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా జుట్టు మరింత సమస్యలొకి జారుకుంటుంది. జుట్టుకు ఇలాంటి సమస్యలన్నీ తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు.. కొలతలతో సహా కావలసిన పదార్థాలు.. తయారీ విధానం ఇదిగో ఇక తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు..
2 టేబుల్ స్పూన్లు మెంతులు
2 టేబుల్ స్పూన్లు నల్ల విత్తనాలు(కలోంజి సీడ్స్)
20 బాదంపప్పులు
10 నుండి 20 మందార ఆకులు
2 మందార పువ్వులు
-20 నుండి 25 కరివేపాకు
రెండు తరిగిన ఉల్లిపాయలు
ఒక కప్పు కొబ్బరి నూనె.
ముందుగా బాదం, మెంతి, కలోంజి గింజలను మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి, ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద చిన్న పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడి అయ్యాక అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మిక్సీ పట్టిన పౌడర్ వేయాలి. ఆ తరువాత పేస్ట్ చేసిన ముద్ద వేసి కాస్త సిమ్ మీద ఉడికించాలి. మిశ్రమం అంతా ఉడికి నూనె పైకి తేరిన మూమెంట్లో గ్యాస్ ఆఫ్ చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి.
తర్వాత, ఒక చిన్న ప్లాస్టిక్, లేదా గాజు సీసా తీసుకుని, దానిపై కాటన్ క్లాత్ వేసి వడగట్టుకోవాలి. దీన్ని డబల్ ఫిల్టర్ చేస్తే నూనె చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇక ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ రెడి అయినట్టు. ఇది మీకు వాసన వస్తుంది అనిపిస్తే దీంట్లొకి రోజ్ మేరీ ఎసెంటియల్ ఆయిల్ లేదా లావెండర్, రోజ్ ఇలా ఏదైనా వాడచ్చు. ఈ ఆయిల్స్ కలపడం వల్ల ఈ నూనె జుట్టుకు అప్లై చేసినప్పుడు తలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వారానికి ఒకసారి తలకు బాగా మసాజ్ చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో.. గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఎంతో అద్భుతంగా పెరుగుతుంది.
◆నిశ్శబ్ద.