గ్లిజరిన్ చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. అయితే గ్లిజరిన్ ను ఉపయోగించే ముందు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. అదికూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది.
గ్లిజరిన్ స్కిన్ కేర్ లో ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం:
1. చర్మానికి గ్లిజరిన్ ఒక టోనర్ గా పనిచేస్తుంది. రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మీ ముఖ చర్మం మీద తుడవడం వల్ల టోనర్ గా మంచి ఫలితాన్ని అంధిస్తుంది.
2. ఈ బ్యూటీ వస్తువు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మాన్ని జిడ్డుగా కూడా ఉండనివ్వదు. పొడిబారిన చర్మం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది.
3. గ్లిజరిన్ మరియు తేనెతో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల చర్మ బిగుతుగా తయారౌతుంది మరియు వృద్ధాప్య యొక్క ప్రారంభ సంకేతాలను నిరోధిస్తుంది.
4. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చర్మ కణాల్లోనికి బాగా గ్రహించబడి, తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది.
5. గ్లిజరిన్ తో మరో బ్యూటీ బెనిఫిట్, చర్మాన్ని రిజొవెనేట్ చేస్తుంది మరియు డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగు చేస్తుంది.
6. మీరు అధిక చెమటకు గురైన మరియు జిడ్డు చర్మం పొదినా, పాలు, తేనె మరియు గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇంకా మీరు గ్లిజరిన్ కు ఓట్ మీల్ చేర్చి స్ర్కబ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్ర్కబ్బింగ్ తో చర్మంలో ఏర్పడ్డ అదనపు జిడ్డును తొలగిస్తుంది.
7. మొటిమలు ఉన్నవారు గ్లిజరిన్ ను చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించవచ్చు. డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగుచేయడంతో పాటు, గ్లిజరిన్ మొటిమలతో పోరాడుతుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.
8. మొటిమల నివారణకు గ్లిజరిన్ పీల్ ఫేస్ మాస్క్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ మాస్క్ ను గుడ్డులోని తెల్లని పదార్థానికి తేనె మిక్స్ చేసి ఫేస్ మాస్క్ లా వేసుకోవడం వల్ల, ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
9. చర్మ సంరక్షణలో సమర్ధవంతమైనది పనిచేస్తుంది ఈ గ్లిజరిన్. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా తయారు చేస్తుంది మరియు ముఖంలో కాంతిని తీసుకొస్తుంది.
10. పొడిబారిన పాదులు, మరియు అరచేతులకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను పాదాలకు చేతులకు అప్లై చేయాలి. మంచి ఫలితం కోసం దీని తేనె ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, చర్మాన్నిసున్నితంగా మార్చుతుంది.