బయట జోరుగా వర్షం కురుస్తున్నపుడు జిమ్‌కు వెళ్లాలన్నా, రన్నింగ్, వాకింగ్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. అందుకే ఇంటినే జిమ్‌గా మార్చుకొని వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా...?

 

1. వాకింగ్‌కు బదులుగా ఇంట్లోనే స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ వంటివి చేయాలి.ఇంట్లోనే కనీసం 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేసుకోవాలి.

2. వర్షాలు కురుస్తున్నప్పుడు శారీరిక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పని సరిగా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి. ఇంట్లో మిగిలిన వ్యాయామాలు చేసే అవకాశం లేని వారికి యోగా ఉత్తమం.

3. ఓ అరగంట సేపు యోగాసనాలు వేయాలి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా ఇంట్లోనే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.

4. ప్రాణాయామం వంటి శ్వాసపరమెన వ్యాయామాలు ఈ కాలంలో చాలా మంచివి.

5. వర్షాకాలంలోనూ వ్యాయామాన్ని కొనసాగించటం వల్ల మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెపుతున్నారు. ఇంట్లోనే మీ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు వీలుగా డంబెల్స్‌తో కొద్దిసేపు వ్యాయామం చేయటం ఉత్తమం.

6. కాస్త ఎండ వచ్చిన రోజున తప్పనిసరిగా వాకింగ్‌కు వెళ్లండి. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ కాలంలో రెగ్యులర్‌గా వాకింగ్‌ కుదరదు కాబట్టి, వారు తప్పనిసరిగా ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలి.