మన అందంలో ‘పాలు’ పంచుకుంటాయి
మీకో విషయం తెలుసా! పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో మన చర్మానికి కూడా అంతే మంచివి. పాలలో ఉండే ఏ, డీ, బీ6, బీ12, బియోటిన్, కాల్షియంలు చర్మానికే కాదు జుట్టు కూడా చాలా మంచివి. పాలు మన చర్మ సౌందర్యానికి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోజూ ముఖానికి పాలు రాసుకోవడం వల్ల ముఖం మీద ఉండే మురికితోపాటు మృత కణాలు పోయి చర్మం చాలా ప్రకాశవంతంగా తయారవుతుంది. పాలతో చేసే కొన్ని ఫేస్ ప్యాక్ లు ఇప్పుడు చూద్దాం....
* రెండు స్పూన్ల పచ్చిపాలు తీసుకొని దానిలో దూదిని ముంచి ముఖం, మెడపై చిన్నగా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము దూది ద్వారా బయటకు వచ్చేస్తుంది. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు.
* ఒక కప్పు పాలు తీసుకోని దానిలో ఓట్స్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఓ పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సాఫ్ట్గ్ గా తయారవుతుంది.
* కొద్దిగా పాలు తీసుకొని దానిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఓ 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల మీ ముఖం మీద మచ్చలు పోవడమే కాదు, చాలా సాఫ్ట్ గా కూడా అవుతుంది.
* కొద్దిగా పచ్చిపాలు తీసుకొని దానిలో కోడిగుడ్డు తెల్ల సొన వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని ఓ 40 నిమిషాలు ఉంచుకోని తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
* పాలు తీసుకొని దానిలో అరటిపండును గుజ్జుగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఓ 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖం ఫ్రెష్ గా సాఫ్ట్ గా తయారవుతుంది.
-పావని గాదం