గోరింట పూసింది కొమ్మ లేకుండా... మగువల చేతిలో మొగ్గతొడిగింది
మగువల మనసుకు ప్రతిరూపం
వాళ్ల భవిష్యత్తుకు కళారూపం
చంద్రవంకల్లాంటి అమ్మాయిల చేతులకు
మందారంలాంటి మెహిందీ వర్ణాలు.
గొరింటా పూచింది మా పాప చేతుల్లో
సిగ్గుల మొగ్గలై తొడిగింది బుగ్గల్లో
మందారంలా పండితే మంచిమొగుడొస్తాడు.
సింధూరం పండితే నచ్చినోడొస్తాడు.
అతివల ఆనందాల హరివిల్లు
అరచేతుల్లో విరిసిన మెహిందీ జల్లు
దీపావళి కాంతుల కేరింతలు
కన్నెపిల్లల మనసుల్ని మురిపించే కలల పంటలు
పార్టీలైన అయినా పండగలైన మగువల చేతులు మెహందితో మెరిసిపోవాల్సిందే. పండగల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేసిది అలంకరణ. జ్యూవెల్లరీ తరువాత ప్రాముఖ్యత మెహందీకే వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరు మెహందీని ఇష్టపడతారు అలాంటి వారి కోసం కొన్ని డిజైన్స్. ఈ దీపావళి మీ కుటుంబంలో కోటికాంతులు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అందరికి తెలుగువన్ దీపావళి శుభకాంక్షలు.
బ్యాక్ హ్యాండ్ :
పాదాలకి :