గర్భవతులలో మార్పులు కారణాలు.. 


మహిళల్లో ఒక అపురూపమైన దశ గర్భం ధరించడం. గర్భం మోసే 9 నెలలు మహిళల జీవితం ప్రతిరోజు, ప్రతి క్షణం అద్భుతం లాగే ఉంటుందని అందరూ అంటారు. అయితే నిరంతరం వారిని ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. 


సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళకి అనారోగ్యం చేస్తుంది. అదంతా నీటి మీద ప్రయాణం వల్ల, ఆ వాసన వల్ల కలిగే ఒకానొక అసౌకర్యం వల్ల కలిగే ఇబ్బంది.  గర్భం వల్ల మహిళల్లో వచ్చే సమస్యలు కూడా అలాంటివే అని మహిళా వైద్యులు కొందరు అంటారు.  కొద్ది సెకన్లు ముఖం తిరుగడం, నీరసానికి గురవడం జరిగినా ఆ తర్వాత నిక్షేపంగా ఉంటారు. కొద్దిగా వాంతులయినా తర్వాత మామూలుగానే ఉంటుంది. 


గర్భం ధరించినవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఉదయమే ఈ వేవిళ్ళు ప్రారంభమయితే మంచం మీంచి లేవకూడదు. కాస్త నిమ్మరసం త్రాగాలి దీనివల్ల నీరసం తగ్గుతుంది. ఏదో ఒక  టిఫిను తిన్న తరువాత ఇంట్లో తిరగడం చేయవచ్చు. ఇంట్లో వాళ్ళ సహాయం ఆ మాత్రం తీసుకోవాలి. కాళీ కడుపుతో ఎప్పుడూ పనులు చేయకూడదు. 


అలాగే మధ్యాహ్నం వేవిళ్ళు రావటం ప్ర్రారంభిస్తే, వెంటనే మీకు ఇష్టమయిన ఆహారం ఏదో తినండి. రెండు బిస్కట్లు, కాస్త బెడ్డు, వెన్న, ఆపిల్ పండు  ఏదయినా సరే. వెంటనే కూర్చుని, ఏదో ఒకటి తినండి. వేవిళ్లు అవే సర్దుకుంటాయి. గర్భం వచ్చాక మొదటి మూడు నెలల్లోనూ ఎవరైనా కడుపునిండా రెండుసార్లు ముందులాగా భోజనం చేయటం మంచిది కాదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినటం మంచిది. 


వేవిళ్ళు దుర్భరంగా ఉంటే వాడదగిన మందులు ఉన్నాయి. కొంతమంది బస్సులో వెడుతున్నప్పుడు ప్రయాణం పడక వాంతులు చేసుకుంటారు. ఈ వాంతులకు గర్భవతికి వచ్చే వేవిళ్ళకూ చాలా తేడా ఉంది. కాబట్టి వాటి కోసం మాత్రమే వైద్యులు సూచించే మందులు వేరుగా ఉంటాయి. 


గర్భవతుల మానసిక పరిస్థితుల గురించి చాలామంది చెబుతుంటారు. 

నిజమే. వారు దేనిమీదా మనస్సును కేంద్రీకరించలేరు.  తల దిమ్ముగా ఉంటుంది. ముఖం తిరుగుతున్నట్లుంటుంది. కొందరికి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరు కృంగిపోయి విచారంగా ఉంటారు. కొందరికి చిరాకు ఎక్కువవుతుంది. కొందరు ఖుషీగా, సరదాగా ఉంటారు. ముందు ఎంతో ఇష్టపడి తినే పదార్ధాలు కొన్నింటిపై ఇప్పుడు అసహ్యం వేస్తుంది. కష్టసాధ్యమైన కొన్ని విషయాల మీద కోరిక ఎక్కువవుతుంది. డీప్ ఫ్రీజులో పెట్టిన పళ్లు యిష్టమవుతాయి. కడుపులో ఖాళీ ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా మితిమించి తినకూడదు. తిండి ఎక్కువవుతుంది. అలా తింటే ఈ స్థితిలో మనిషి బరువు ఎక్కువైపోతుంది. మరీ ఘోరమేమిటంటే కొందరికి తినకూడని వాటిపై తినకోరిక ఎక్కువ కావటం.  వాటిలో బూడిద, గోడసున్నం, బొగ్గులు తెగతినేస్తారు. వీటివల్ల పళ్లుపాడయినా ప్రమాదమేమీ లేదు. శరీరం వాటిని అరాయించుకోదు. విరోచనంలో పోతాయి. కొంతమందిలో పొగతాగే అలవాటు ఉంటుంది. అయితే విచిత్రంగా వాళ్ళు గర్భవతులు అవ్వగానే వాళ్లకు ఆ వాసన పడకుండా అవుతుంది. కేవలం కడుపులో బిడ్డకు ప్రమాదమని మాత్రమే కాదు శరీరతత్వం మారడం వల్ల ఇలా జరుగుతుంది.  

◆నిశ్శబ్ద.