అందమైన చర్మం కావాలంటే.. వీటిని ఎక్కువగా తినాలి..!

చర్మం అందంగా , కాంతివంతంగా ఉంటే వయసు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కారణంగా చాలా మంది చర్మం యవ్వనంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. దీనికోసం చాలా రకాల టిప్స్ కూడా ఫాలో అవుతారు. కొందరు అయితే చర్మం ఆరోగ్యంగా, అందంగా, యవ్వనంగా ఉండటం కోసం ఖరీదైన స్కిన్ ట్రీట్మెంట్లు, ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులు కూడా ఉపయోగిస్తారు. కానీ చర్మ సంరక్షణ నిపుణులు, ఆహార నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం.. నిజమైన అందం అనేది కేవలం పైన పూసే క్రీములు, తీసుకునే ట్రీట్మెంట్ల మీద కాదు.. లోపలి నుండి వస్తుంది. ఇదేలాగంటే..
చర్మాన్ని అందంగా, యవ్వనంగా కనిపించేలా చేయడంలో ఆహారానిదే కీలకపాత్ర. సరైన పోషకాహారం, చర్మానికి మేలు చేసే ఆహారాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. అయితే కేవలం ఒకే ఒక కూరగాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం అద్బుతంగా మారుతుంది. అదేంటో తెలుసుకుంటే..
టమోటా..
చర్మ ఆరోగ్యానికి టమోటా అద్బుతంగా పనిచేస్తుంది. ఈ విషయం తెలిసి చాలా మంది షాకవుతారేమో.. కానీ చర్మం అందంగా, ప్రకాశవంతంగా మారడంలో టమోటాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి.
టమోటాలలో లైకోపిన్, విటమిన్-సి, యాంటీఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం అందంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి.
టమోటాలు చర్మ ట్యాన్ తొలగించడంలో ఉపయోగిస్తారని చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే టమోటాలు కేవలం ట్యాన్ ను తొలగించడమే కాదు.. బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మపు రంగును ప్రకాశవంతం చేయడంలో కూడా టమోటాలు సహాయపడతాయి.
చర్మ సంరక్షణ కోసం టమోటాలను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి టమోటాలను నేరుగా తినడం. వీటిని శుభ్రంగా కడిగి సలాడ్ లాగా తినవచ్చు. ఇక టమోటా రసం చర్మానికి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. టమోటా జ్యూస్ ను కాటన్ బాల్ తో అద్దుకుని ముఖానికి మొత్తం అప్లై చేసి ఆరిపోయిన తరువాత సాధారణ నీటితో కడుక్కోవాలి. ఇవి చాలా ప్రబావావంతంగా పనిచేస్తాయి.
టమోటా జ్యూస్ ను నేరుగా అప్లై చేయలేకపోయినా, జ్యూస్ ను ఏదైనా ఫేస్ ప్యాక్ లో కూడా జతచేసుకోవచ్చు. ఇది మరింత మెరుగ్గా ఉంటుంది.
*రూపశ్రీ.


.webp)
