చిన్న చిన్న చిట్కాలతో అందం, ఆరోగ్యం
* మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలాచేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
* ఒక గ్లాస్ నీటిలో ఉసిరిపొడి వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను కడగాలి. ఇలా చేస్తే కళ్లు ఆరోగ్యంగా మెరుస్తాయి.
* ముఖంలో అప్పటికప్పుడు మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చెయ్యాలి. పావుగంట తర్వాత ముఖమంతా కడిగేయాలి.
* పొడిబారిన జుట్టుకోసం బాగా పండిన అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి.
* రోజ్‌వాటర్, గ్లిజరిన్ కలిపి కాళ్ళ పగుళ్ళున్న చోట దూదితో రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గిపోయి కాళ్ళు మృదువుగా కనిపిస్తాయి.
* రెండు స్పూన్ల గోధుమపిండి, కప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా ఉంటుంది.
* జీలకర్రని వేడినీళ్లలో వేసి ఉడికించాలి. ఈ నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.