ఆకర్షించే బ్లౌజుల కోసం బ్యూటీ చిట్కాలు

ఈ మధ్య కాలంలో చీర అందాన్ని పెంచటంలో "బ్లౌజులు" ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రకరకాల వెరైటీలతో వాటిని డిజైన్ చేస్తున్నారు. హై-నెక్ బ్లౌజులు నుంచి లో-నెక్ బ్లౌజులు దాకా.. వీపు అందంగా కనిపించేలా డిజైన్ చేసిన బ్లౌజులు వేసుకునేప్పుడు ఒక్కసారి వీపు అందాన్ని పెంచే చిన్న చిన్న బ్యూటీ టిప్స్ పాటిస్తే బాగుంటుంది అంటున్నారు బ్యూటీ షియన్స్. మరి మనం సాధారణ౦గా నిర్లక్ష్యం చేసే వీపే అందాన్ని పెంచటానికి వారు ఇస్తున్న టిప్స్ ఏంటో చూద్దామా ...!

*యాపిల్ ని మెత్తగా గ్రైండ్ చేసి,దాంట్లో తేనె కలిపి వీపుకు పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే చర్మం అందంగా మెరుస్తుంది. వారానికి ఒకసారి అయిన ఇలా చేస్తుంటే నల్లగా కనిపించే వీపు భాగం మంచి రంగు వస్తుందట.

*ఇక అందాన్ని పెంచటంలో ముల్తానీ మట్టి తిరుగులేదని తెలిసిందేగా. ఆ ముల్తానీ మట్టి ప్యాక్ వీపు అందానికి కూడా పనికొస్తుందట. ముల్తానీ మట్టిని పెరుగులో కలిపి, ప్యాక్ వేసుకొని 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి .

*పొడి చర్మం కలవారైతే కీరదోస గుజ్జులో పుదీనా ఆకుని గ్రైండ్ చేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ప్యాక్ గా వీపుకు వేసుకుంటే కొత్త మెరుపు ఖాయం అని చెపుతున్నారు.

*ఇక అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ మెరుపు కోసం... పెరుగు, తేనే, నిమ్మరసం, విటమిన్ E క్యాప్సుల్ లని పేస్టులా చేసి, వీపు భాగానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత స్నాన౦ చేయాలి.

ఇలా వీపు భాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ..మీకు అనుకూలమైన ప్యాక్ ను ఎంచుకొని వేసుకుంటే ఎలాంటి డిజైన్ బ్లౌజునైనా ధైర్యంగా వేసుకోవచ్చు.