వయసు పెరుగుతున్నాకొద్దీ ముఖంలో మెరుపు, కోమలత్వం, మృదుత్వం తగ్గకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి అవేమిటో చూద్దామా..!

* చర్మానికి హాని కలిగించే సబ్బులు వాడకూడదు.

* తక్కువ రసాయనాలున్న, నాణ్యమైన క్లేన్సర్లు, టోనర్లు, మాయిశ్చరైజర్లను మాత్రమే ఎంచుకోవాలి.

* బయటకు వెళ్ళినప్పుడల్లా సన్ స్క్రీన్ లోషన్ ను తప్పనిసరిగా రాసుకోవాలి.

* ఎండవల్ల చర్మానికి హాని కలుగుతుంది. దీనివల్లే ముడతలు, గీతలు ఏర్పడతాయి. అందుకే ఎక్కువమోతాదులో సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ అనేది వేసవికాలం మాత్రమే కాదు...ఏడాదంతా రాసుకోవాలి.

* ఆహార విషయంలో కూడా ప్రత్యెక శ్రద్ధ అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారపదార్ధాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. టమాటలు, బొప్పాయి, అరటిపండ్లు, ఆకుకూరలు, ద్రాక్ష, క్యారట్, బీట్ రూట్, నాణ్యమైన చాక్లెట్లు తినాలి.

* రోజూ క్రమం తప్పకుండా పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు తాగాలి.

* చక్కని క్లెన్సర్ తో వేసుకున్న మేకప్ ను తొలగించుకోవాలి. ఆ తర్వాత మయిశ్చరైజేషన్ రాసుకోవడం మాత్రం మరచిపోకూడదు.

* నైట్ క్రీంల విషయానికోస్తే.... ఆల్ఫా హైడ్రాక్సైడ్, బీటా హైడ్రాక్సైడ్, కోజిక్ యాసిడ్, విటమిన్ సి, రేటేనిక్ యాసిడ్ సమృద్దిగా లభించే క్రీంలు ఎంచుకోవాలి. చర్మ తత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. తక్కువ మోతాదులో మాత్రమే రాసుకోవాలి. అయితే రోజూసన్ స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లు క్రమం తప్పకుండా రాసుకుంటున్నప్పుడే నైట్ క్రీంలు వాడాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.