అందానికి బంధువీ పండు

దానిమ్మ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా  అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మ గింజల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అవి చర్మాన్ని రక్షించి అందాన్ని కాపాడతాయి.

* దానిమ్మ రసంలో బాదం నూనె కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా కొన్నాళ్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి.
 
* మొటిమలతో కళ తప్పిన ముఖానికి దానిమ్మ రసంతో కళ వస్తుంది. దానిమ్మ రసానికి  బాదం నూనె, నారింజ తొక్కల పొడి, పచ్చిపాలు కలిపి పేస్ట్‌లా చేసుకుని ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుంటే కొద్దిరోజుల్లోనే మొటిమలు తగ్గుతాయి.
 
* కాస్త రంగు తక్కువగా ఉన్నవారు దానిమ్మ గింజల రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

* దానిమ్మ రసం, తేనె కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే  పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.

* చర్మం ముడతలు పడింది అనుకున్నప్పుడు దానిమ్మ గింజల రసంలో తేనె, బాదం నూనె కలుపుకుని రోజూ రాసుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.