అనుష్క అందం - ఏంటా రహస్యం
ఎన్నాళ్ళయిన అనుష్క అందం తగ్గకపోగా రోజురోజుకి పెరుగుతోందేంటా అని ఆలోచలో పడ్డారా,ఎందుకండీ అంత శ్రమ మీకు? అనుష్క శర్మ నేరుగా చెప్పిన బ్యూటీ సీక్రెట్స్ వింటే మీకే ఔరా! అనిపిస్తుంది. వయసు 35 దాటుతున్నా ఇంకా అలా అందంగా ఉండటానికి కారణం ఎక్కువగా నీళ్ళు తాగటమే అని చెప్తోంది అనుష్క. నీళ్ళు ఎక్కువగా తాగటం వల్ల చర్మంలో నిగారింపు వస్తుందిట. చర్మం పోడిబారిపోకుండా కూడా ఉంటుందిట. తను రోజుకు కనీసం ఆరు లీటర్ల నీళ్ళు తాగుతుందిట.
* తేనే నేచురల్ మెడిసిన్ లా పనిచేసి శరీరంలో మెరుపును తెప్పించగలదట. అందుకే తను బ్రేక్ఫాస్ట్ గా బ్రెడ్ అండ్ హనీ తీసుకుంటుందిట. చర్మాన్ని మెరిపించే శక్తి తేనెకి ఉందట.
* అలాగే సౌందర్య పోషణ కోసం ఎక్కువగా పార్లర్స్ కి వెళ్ళకుండా ఇంట్లోనే నిమ్మరసం, సెనగపిండి కలిపి దానిని కాస్త నలుపుగా ఉన్న మోకాళ్ళ దగ్గరా అలాగే మోచేతుల దగ్గరా అప్లై చేసుకుంటుందిట. వాటివల్ల డార్క్ గా ఉన్న స్కిన్ టోన్ లైట్ గా మారుతుందిట.
* అనుష్క ఇప్పటికీ అంత ఎనేర్జేటిక్ గా ఉండటానికి 100% కారణం క్రమం తప్పకుండా చేసే ఎక్సర్సైజే అని చెప్తోంది. ఎంత బిజీగా ఉన్న రోజులో 30 నిమిషాలు తప్పకుండా యోగా చేస్తుందిట. దీనివల్ల శరీరం నాజుకుగా ఉండటమే కాదు బాడీ షేప్ మారకుండా అలానే ఉంటుందిట.
* తను ఎక్కువగా ఆహారంలో భాగంగా కూరగాయలు, పళ్ళు, జ్యూస్ లు తీసుకుంటూ ఉంటుందిట. అంతేకాదు రాత్రిళ్ళు 8 లోపే డిన్నర్ పూర్తిచేస్తుందిట. పడుకోటానికి మూడు గంటల మూడు ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చెప్పలేం అంటోంది తను.
జేజమ్మ అందానికి రహస్యం ఇదా అని చదివి వదిలేయకుండా మనం కూడా వయసు పైబడుతున్నా అందాన్ని ఎలా కాపాడుకోవాలో అనుష్క చెప్పిన మాటలు విని కొన్నయినా పాటిద్దామా.
- కళ్యాణి