తేనెలొలికె  పెదాలకోసం

 

 


మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటే మనకి తెలియకుండానే ఎక్కువగా చూసేది ఎదుటివారి  పెదాలనే అట. దానిని మానసిక శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. మరి మన పెదాలు పొడిబారిపోయి ఉంటే చూడటానికి బాగోదు కదా. అందుకే కళావిహీనంగా ఉండే పెదాలు ఎర్రటి దొండపండులా  మారిపోవాలంటే కొంత మేజిక్ చెయ్యాల్సిందే.

ఒక స్పూన్ పాల మీగడని బీట్రూట్ రసం లేదా దానిమ్మ రసంతో కలపండి, ఈ మిశ్రమాన్ని  పెదాలకు పట్టిస్తే ఎర్రటి మృదువైన  పెదాలని సొంతం చేసుకోవచ్చు.

కొంచెం పెరుగులో టమాటా పేస్ట్ ని కలిపి పెదాలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

తేనె అనేది ఎలాంటి చిట్కాలకైనా  ఉపయోగపడుతుంది,1\2 టీ స్పూన్ తేనెను 1\2 టీ స్పూన్ నిమ్మ రసంతో కలిపి పెదాలకు పట్టిస్తే, పగుళ్ళతో జవసత్వం కోల్పోయిన పెదాలు ఎంతో అందంగా మారిపోతాయి.

ఎండుద్రాక్షని రాత్రంతా నీటిలొ నానపెట్టి ఉదయాన్నె ఖాళి కడుపుతో తింటే మంచి సత్ఫలితాల్ని ఇస్తుంది.ఇది కేవలం పెదాలకే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.  

గులాబి రేకుల్ని పాలల్లో కలిపి ముద్దగా చేసి పెదాలకు రాసుకుంటే ఊహించని ఫలితాలు పొందవచ్చు.

కొబ్బరి నూనె, బాధం నూనె సమపాళ్ళలొ కలిపి పెదాలకి పట్టించి రాత్రంతా ఉంచాలి, ఇలా 2 వారాలు చేస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు.

విటమిన్ “ఈ” కలిగి ఉన్న లిప్ క్రీంని రోజు నిద్ర పోయే ముందు పెదవులకు రాసుకుంటే మర్నాటి ఉదయానికి పెదాలు మెత్తగా తయ్యారవుతాయి. 

ఇలాంటి చిట్కాలు పాటిస్తూనే శరీరానికి తగినంత నీరు తీసుకోవటం మర్చిపోవద్దు.నీరు ఎంత తాగితే శరీరం అంత నిగనిగలాడుతూ ఉంటుంది. 

కళ్యాణి