అందమైన శరీరం కోసం పవర్ ఫుడ్స్ :

ఓట్ మీల్:

ఓట్ మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. శరీరం మరియు జీవన చర్యకు ఉపయోగపడు శక్తిని విడుదల చేయుట మరియు కొవ్వు నిల్వలను తగ్గించుటకు ఓట్ మీల్ అద్భుతంగా సహాయపడుతుంది.

గుడ్లు:

గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది.

కాయధాన్యాలు:

మీరు కండర నిర్మాణాన్ని పెంచుకోదలచుకుంటే కాయధాన్యాలను తీసుకుంటుండాలి. కాయధాన్యాలలో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి.

సాల్మన్ చేప:

ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడుసార్లు సాల్మన్‌ ను తీసుకోవాలి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్స్ పెరగడానికి బాగా సహాయపడుతాయి.

గొర్రె మాంసము:

మటన్ రెడ్ మీట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ మీట్ ను తినడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు. మటన్ లేదా బీఫ్ లో అమినో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మటన్ లేదా బీఫ్ తరుచూ తీసుకొంటే మజిల్స్ త్వరగా ఏర్పడుతాయి. మటన్ లో కూడా అర్జినైన్ అనే విటమిన్ మజిల్స్ పెరగడానికి బాగా తోడ్పడుతుంది.

డార్క్ చాక్లెట్:

చాక్లెట్ ఆరోగ్యానికి లాభదాయకం కాదని ఎవరు చెప్పారు?డార్క్ చాక్లెట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫ్లెవనాయిడ్ కంటెంట్స్ బ్లడ్ సర్కులేషన్ కు బాగా సహాయపడుతాయి. మరియు జీవక్రియలను మెరుగుపరుస్తుంది.

పెరుగు:

కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి, జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటాయి.

కాటేజ్ చీజ్:

ఇందులో మజిల్ బిల్డ్ చేసే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ ఒక కప్పు కాటేజ్ చీజ్ లో 28గ్రాముల ప్రోటీనులు కలిగి ఉన్నాయి.

వెయ్ ప్రోటీన్ :

అత్యధిక నాణ్యత గల ఒక ప్రోటీన్ ఇది, దీన్నివ్యాయామం తర్వాత తీసుకోవడం ద్వారా ఇది శరీరంలో దాదాపు వెంటనే కలిసిపోతుంది. అందుబాటలో ఉండే ఈ వేయ్ ప్రోటీన్ ను నీటితో కలిపి ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా ఇది తక్షణ శక్తిని అంధిస్తుంది.

అరటి:

మీరు తీసుకొనే ఫుడ్ లో తప్పనిసరిగా అరటిపండు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం అధిక శాతంలో ఉండి శరీరానికి కావలసినన్ని మినిరల్స్ ను అందిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత పెంచడానికి, దృష్టి సారించడానికి కావల్సిన డొపమైన్ అనే రసాయనాలను ఇది విడుదల చేస్తుంది. నరాలను ఆరోగ్యంగా ఉంచే సెరోటినీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పుష్కలమైన పొటాషియం మరియు క్యాల్షియం బోన్ హెల్త్ కు చాలా సహాయపడుతుంది.

పైనాపిల్:

పైనాపిల్ జీర్ణవ్యవస్థకు సహాయపడే మంచి ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. దీన్ని వ్యాయామం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. పైనాపిల్లో ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండేందుకు సహాయపడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

స్వీట్ పొటాటో:

శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది.

పుట్టగొడుగులను:

పుట్టగొడుగులను కండరము పుష్టికోసం ప్రోత్సహించే రుచికరమైన మరియు పుష్టికరమైన కూరగాయలతో సమానం.