పాలకూర, బీట్ రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉండే విత్తనాలు.. లేడీస్ తప్పనిసరిగా తినాలి..!

పాలకూర, బీట్ రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉండే విత్తనాలు.. లేడీస్ తప్పనిసరిగా తినాలి..! ఆడవారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం,  పోషకాల లోపం వల్ల అనీమియా, కండర ద్రవ్యరాశి,  ఎముకలు బలహీనంగా ఉండటం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.  అయితే తక్కువ పరిమాణంలో తిన్నా శరీరానికి మెరుగ్గా పోషకాలు అందించగల ఆహారాలు ఇలాంటి లేడీస్ సమస్యలకు చక్కగా చెక్ పెడతాయి. అలాంటి వాటిలో గుమ్మడికాయ విత్తనాలు ప్రముఖమైనవి. అసలు గుమ్మడికాయ విత్తనాలలో ఉండే పోషకాలేంటి? వీటిని ఆహారంలో ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు? తెలుసుకుంటే.. గుమ్మడికాయ గింజలలో పోషకాలు.. గుమ్మడికాయ గింజలు ప్రోటీన్, మెగ్నీషియం,  ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా ఐరన్  కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలను ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల  ఆరోగ్యం బలోపేతం అవుతుందని మహిళా వైద్యులు అంటున్నారు. ఐరన్ కు పవర్ హౌస్.. గుమ్మడికాయ గింజలు ఐరన్ కు  అద్భుతమైన మూలం. వాటిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాలకూర,  బీట్ రూట్ వంటి ఐరన్ సోర్స్ ఎక్కువగా ఉన్న  ఆహారాల కంటే ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి,  శరీరమంతా ఆక్సిజన్ రవాణాకు ఐరన్ చాలా అవసరం. ఈ విత్తనాలను ప్రతిరోజూ గుప్పెడు తినడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.  ఇది రోజంతా  శక్తివంతంగా ఉంచుతుంది. మంచి నిద్ర, మనశ్శాంతి.. గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ట్రిప్టోఫాన్ మెదడును ప్రశాంతపరుస్తుంది,  సెరోటోనిన్ అనే హార్మోన్ స్రావంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  సెరోటోనిన్ ను హ్యాపీ ఫీలింగ్ హార్మోన్ అని అంటారు.  ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.   హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్.. గుమ్మడికాయ విత్తనాలలోని మెగ్నీషియం  ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ కణాలు రక్తంలో చక్కెరను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్,  ప్రీ-డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్లు.. గుమ్మడికాయ గింజలు జింక్,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అద్భుతమైన కలయిక. జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది,  చర్మ కణాలను మరమ్మతు చేస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ E జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి. ఇవి జుట్టు, చర్మం,  గోళ్లను ఆరోగ్యంగా, మెరిచేలా,  బలంగా ఉంచుతాయి.                                  *రూపశ్రీ.

మహిళలు చేసే ఈ తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి..!

మహిళలు చేసే ఈ తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి..!  గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో గర్భాశయంలో ప్రారంభమయ్యే తీవ్రమైన క్యాన్సర్. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమావైరస్. ఇది   లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. HPV ఇన్ఫెక్షన్ చాలా సాధారణం అయినప్పటికీ, ఇది  సోకిన ప్రతి స్త్రీకి క్యాన్సర్ రాదు. చాలా HPV ఇన్ఫెక్షన్లు శరీరం తనకు తానే పరిష్కరించుకుంటుంది.  ఇది దాదాపు 2 సంవత్సరాలలో నయం అయిపోతుంది. కానీ మహిళల  రోజువారీ అలవాట్లు కొన్ని ఈ వైరస్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అలవాట్లు శరీరం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి, ఇది HPV సంక్రమణను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది.  ఇన్ఫెక్షన్ చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఇది  చివరికి క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రమాదానికి మూల కారణాలను అర్థం చేసుకుని, సరైన సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నివారించవచ్చు. మహిళలు రోజువారీ చేసే ఏ తప్పుల వల్ల గర్బాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందో తెలుసుకుంటే.. స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా.. క్రమం తప్పకుండా గర్భాశయ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోకపోవడం చాలా పెద్ద తప్పు. ఈ పరీక్ష గర్భాశయంలో క్యాన్సర్‌గా మారడానికి ముందే క్యాన్సర్‌కు ముందు వచ్చే మార్పులను గుర్తిస్తుంది. 25 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు చేయించుకోవాలి. ఈ పరీక్షను వాయిదా వేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారం.. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.  ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు,  తక్కువ పండ్లు,  కూరగాయలు తిన్నప్పుడు  ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. ఈ లోపం శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు HPV ఇన్ఫెక్షన్‌తో ఎక్కువ కాలం పోరాడలేరు. దీని వలన ఇన్ఫెక్షన్ కొనసాగి,  క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భధారణ నిర్ణయాలు.. చిన్న వయసులోనే మొదటి గర్భం దాల్చడం, పదే పదే గర్భం దాల్చడం వల్ల గర్భాశయ కణాలు మరింత సున్నితంగా మారతాయి.  అలాగే.. ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల ఏదైనా  గర్భనిరోధక మాత్ర తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                 *రూపశ్రీ.

వెట్ వైప్స్.. చాలామంది మహిళలు ఉపయోగించే వెట్ వైప్స్ గురించి ఈ నిజాలు తెలుసా..

 వెట్ వైప్స్.. చాలామంది మహిళలు ఉపయోగించే వెట్ వైప్స్ గురించి ఈ నిజాలు తెలుసా.. చర్మ సంరక్షణలో భాగంగా చాలామంది మహిళలు వెట్ వైప్స్వెట్ వైప్స్ ను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి తగిన సమయం లేదా వాతావరణం లేనప్పుడు, మేకప్ తొలగించడానికి సమయం లేనప్పుడు వెట్ వైప్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా తొందరగా ముఖ చర్మం మీద మురికి, నూనె,  మేకప్.. మొదలైనవాటిని తొలగిస్తాయి. ఇవి చర్మ సంరక్షణకు మంచిదే అయినప్పటికీ వీటిని పదే పదే ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.  ఇంతకీ వెట్ వైప్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలేంటి? వీటి గురించి చాలామందికి తెలియని నిజాలు తెలుసుకుంటే.. వెట్ వైప్స్ లో ఏముంటుంది? వెట్ వైప్స్ లో ఆల్కహాల్,  రసాయనాలు, సువాసనలు ఉంటాయి.  ఇవి చర్మానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. వెట్ వైప్స్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది? వెట్ వైప్స్‌ను చాలా ఎక్కువగా  ఉపయోగిస్తే, వాటిలోని ఆల్కహాల్,  రసాయనాలు  చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. ఇది కొన్నిసార్లు  చర్మాన్ని చాలా పొడిగా చేస్తుంది. ఎంత మాయిశ్చరైజర్ వాడినా దానిని తగ్గించడం కష్టం అవుతుంది. ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వెట్ వైప్స్ ను పదే పదే ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం, దురద,  దద్దుర్లు వస్తాయి. కొన్నిసార్లు, ఈ చికాకు చాలా ఎక్కువగా  అవుతుంది. ఇది హాస్పిటల్స్ కు వెళ్లే పరిస్థితిని కూడా తీసుకురావచ్చట.  ఇప్పటికే సెన్సిటివ్ స్కిన్ ఉంటే వెట్ వైప్స్ వాడకపోవడం బెటర్. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్  సులభంగా మొటిమలకు, ర్యాషెస్ కు గురవుతుంది. చిన్న వయసులోనే ముసలి వాళ్ల లాగా ముఖ చర్మం కనిపిస్తుంటే.. వెట్ వైప్స్ వాడటం కారణం కావచ్చు.   వెట్ వైప్స్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం సహజత్వాన్ని కోల్పోయి చాలా త్వరగా వృద్దాప్యానికి లోనవుతుంది.                             *రూపశ్రీ.

మహిళల్లో అత్యంత ప్రాణాంతకర క్యాన్సర్ ఇదే.. దీని గురించి తప్పక తెలుసుకోవాలి!

మహిళల్లో అత్యంత ప్రాణాంతకర క్యాన్సర్ ఇదే.. దీని గురించి తప్పక తెలుసుకోవాలి!   ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.  అన్ని రకాల క్యాన్సర్‌లతో ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తాయి.  గర్భాశయ క్యాన్సర్ అలాంటి తీవ్రమైన సమస్య.  2020లో గర్భాశయ క్యాన్సర్ 6.04 లక్షల కొత్త కేసులు,  3.42 లక్షల కంటే ఎక్కువ మరణాలు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్ . ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే ఈ ఆరోగ్య   సమస్య గురించి ప్రజల్లో అవగాహన పెంచడం,  నివారణ, స్క్రీనింగ్,  చికిత్స గురించి మహిళలకు అవగాహన కల్పించే లక్ష్యంతో జనవరి నెలను 'సర్వికల్ క్యాన్సర్ అవేర్‌నెస్ నెల'గా జరుపుకుంటారు. సర్వైకల్ క్యాన్సర్.. సర్వైకల్ క్యాన్సర్  గర్భాశయంలో వచ్చే క్యాన్సర్. ఇది యోనితో అనుసంధానించబడిన గర్భాశయం యొక్క దిగువ భాగం. ఈ క్యాన్సర్ తరచుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.  దీని లక్షణాలను గుర్తించడం కష్టం. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్  రావడానికి  అత్యధిక  కారణమవుతుంది. HPV అనేది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఒక సాధారణ అంటువ్యాది. శరీరం  రోగనిరోధక వ్యవస్థ HPV వైరస్‌ను నాశనం చేయగలిగినప్పటికీ తక్కువ శాతం మంది వ్యక్తులలో వైరస్ సంవత్సరాలు శరీరంలోనే ఉండి క్యాన్సర్‌కు కారణమవుతుంది. గర్భాశయ క్యాన్సర్  లక్షణాలు.. సాధారణంగా గర్భాశయ క్యాన్సర్  ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు, అందుకే దాని ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి, వీటి గురించి  శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. సంభోగం తర్వాత లేదా పీరియడ్స్ లేకపోయినా, లేదా  మెనోపాజ్ తర్వాత యోనిలో రక్తస్రావం. భారీ ఋతు రక్తస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ కాలం ఉండటం. యోని ద్వారం దుర్వాసన. సంభోగం సమయంలో పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుంది? ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని పరిస్థితులు ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నా. లైంగిక భాగస్వాములు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇది కాకుండా చిన్న వయస్సులో సెక్స్ చేయడం కూడా HPV ప్రమాదాన్ని పెంచుతుంది. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు) కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  రోగనిరోధక వ్యవస్థ మరొక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బలహీనపడి  HPV ఇన్ఫెక్షన్ వస్తే గర్భాశయ క్యాన్సర్‌ కు గురయ్యే అవకాశం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం చేసే  మహిళలకు HPV ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉండచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా నివారించాలి? కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌ను అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం HPV వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. HPV సంక్రమణను నివారించడానికి టీకాలు వేయడం గర్భాశయ క్యాన్సర్,  ఇతర HPV సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. HPV వ్యాక్సిన్  సరైనదా, కాదా అని  వైద్యుడిని అడగి తీసుకోవాలి.  ఇది కాకుండా డాక్టర్ సలహాపై రెగ్యులర్  పరీక్ష చేయించుకోవాలి. పాప్ పరీక్ష గర్భాశయంలో క్యాన్సర్ పరిస్థితులను గుర్తించడంలో సహాయపడుతుంది.                                                        *నిశ్శబ్ద.

మహిళలూ ఈ లక్షణాలను విస్మరించకూడదు.. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు!

మహిళలూ ఈ లక్షణాలను విస్మరించకూడదు.. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు!   బ్రెస్ట్ క్యాన్సర్ ( రొమ్ము క్యాన్సర్) నేటికాలంలో మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒక్కటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఈ మహమ్మారి వల్ల దాదాపు పదిమిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 2.26మిలియన్ల మంది బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారని WHO వెల్లడించింది. మనదేశంలో ఏటా దీని బారినపడి మరణిస్తున్నవారి సంఖ్య లక్షల్లో ఉందంటే ఈ మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు. 40ఏళ్లుదాటిన మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ నేటికాలంలో మూడుపదుల వయస్సు దాటనివారిపై కూడా ఈ మహమ్మారి పంజావిరుస్తోంది. సరైన అవగాహన ఉన్నట్లయితే... ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. స్త్రీలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవల్సిన సమయంలో ఎన్నో బాధ్యతలు వారిని నిర్లక్ష్యం చేస్తాయి. కుటుంబ బాద్యత ఆమెదే. కానీ ఆమె ఆరోగ్యం విషయంలో మాత్రం వెనక్కు తగ్గుతుంది. ఈ నిర్లక్ష్యమే వారిలో ఎన్నో జబ్బులకు కారణం అవుతుంది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న జబ్బుల్లో బ్రెస్ట్ క్యాన్సర్. నేటికాలంలోనూ చాలామంది మహిళల్లో ఈ మహమ్మారి గురించి అవగాన లేదు. చాలామందిలో మూడోదశకు వచ్చినప్పుడు మాత్రమే గుర్తిస్తున్నారు. గ్రామీణ, అరబ్ ప్రాంతాల నుండి మెట్రో పాలిటిక్స్ సిటీ వరకు, మహిళలు ఇప్పటికీ బ్రెస్ట్ స్క్రీనింగ్ లేదా ఇతర రకాల రొమ్ము పరీక్ష ప్రక్రియలకు భయపడుతున్నారు. మహిళలు తమ ఆరోగ్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి? స్త్రీలలో వచ్చే వ్యాధులలో ఒకటి రొమ్ము క్యాన్సర్. ఇది రొమ్ములో అభివృద్ధి చెందుతుంది. ఈ క్యాన్సర్ పురుషుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మహిళలకు మాత్రమే అవకాశం ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ అనేది చిన్న గడ్డలతో ఏర్పడుతుంది. రొమ్ము లోపల లేదా బయట ఏర్పడతాయి. ఇది ప్రారంభ దశలో చిన్నపాటి నొప్పితో ఉంటుంది. ఆ సమయంలోనే గుర్తించినట్లయితే...ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.   రొమ్ము క్యాన్సర్ లక్షణాలు: -రొమ్ములోని ఏ భాగంలోనైనా భరించలేని నొప్పి -రొమ్ము ఆకృతిలో మార్పు -చనుమొన నుండి పాలు కాకుండా ద్రవం కారడం. -రొమ్ము వాపు, నొప్పి, బిగుతుగా అనిపించడం -చనుమొన ఎరుపు రొమ్ము క్యాన్సర్ ప్రమాద కారకాలు: -పీరియడ్స్ ముందుగానే రావడం. -శారీరకంగా చురుకుగా లేకపోవడం. -కుటుంబ చరిత్ర -గర్భనిరోధక మాత్రలు -వ్యాయామం చేయకపోవడం. -అనారోగ్యకరమైన ఆహారం రొమ్ము క్యాన్సర్ చికిత్స: రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, బయాప్సీని ఉపయోగిస్తారు. సరైన సమయంలో రొమ్ము క్యాన్సర్  ను గుర్తిస్తే  చికిత్స, నివారణ రెండూ సాధ్యమే. డైటరీ థెరపీ, బ్రెస్ట్ సర్జరీ, మందులు, హార్మోన్ల ఇంజెక్షన్లు మొదలైన వాటిని నివారించాలి. అయితే, దాని చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో క్యాన్సర్ దశ, రోగి వయస్సు, స్థానం, మానసిక ఆరోగ్యం, రోగి యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!

ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!     గర్భధారణ స్త్రీకి మరొక కొత్త ప్రపంచాన్ని పరచయం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా స్త్రీలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  గర్భవతులైన స్త్రీలు సమతుల ఆహారాన్ని,  పోషకాలు సమృద్దిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు.  అయితే కొంతమంది మహిళలు ముందు రోజు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచుకుని మరీ తింటూ ఉంటారు. రుచి కోసమో లేక మిగిలిపోతుందనో.. లేక ఖరీదైనదనో.. ఏదో ఒక కారణం తో ముందురోజు ఆహారం తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిదేనా? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారంటే.. గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చేసే తప్పులలో అతి పెద్ద తప్పు ముందురోజు ఆహారాన్ని తినడం. ఇలా పాతబడిన ఆహారం తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భవతులు తాజాగా వండిన పోషకమైన ఆహారాన్ని మాత్రమే తినాలని వారు చెబుతున్నారు. ముందురోజు ఆహారం లేదా పాతబడిన ఆహారం తినడం వల్ల గర్భవతులలో చాలా ప్రభావం ఉంటుందట. ముఖ్యంగా కడుపులో పిండం అభివృద్ది మీద చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.  ముందురోజు మిగిలిన ఆహారం తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందట. ఇలా గర్భవతులుగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడితే అది అకాల ప్రసవాలకు,  గర్భస్రావాలకు, తక్కువ బరువు ఉన్న శిశువు జననానికి దారి తీస్తుందట. ముందురోజు మిగిలిపోయిన ఆహారం ఎందుకు తినకూడదు అనే విషయాన్ని కూడా వైద్యులు వివరించారు.  ముందురోజు ఆహారంలో సాల్మోనెలోసిస్,  లిస్టెరియోసిస్ వంటి బ్యాక్టీరియా,  వైరస్ లు ఉంటాయి. ఇవన్నీ ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు అతిపెద్ద కారణాలు. గర్భం ధరించాలని అనుకునే మహిళలు, గర్భవతులు ముందురోజు మిగిలిన ఆహారాన్ని తినడం మానుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఒకసారి వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినడం కూడా మంచిది కాదు. బయట నుండి తెచ్చిన ఆహారానికి వీలైనంత దూరం ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో తెచ్చినా దాన్ని వేడిగా ఉన్నట్టే తినాలి. బయట తెచ్చిన ఆహారాన్ని నిల్వ ఉంచడం మంచిది కాదు.                                          *రూపశ్రీ.

రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా...   మూసాంబి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.  దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్, ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మూసాంబి జ్యూస్, సిట్రస్ ఫ్రూట్, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. మోసంబి జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.   ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జలుబును నివారిస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: మీ శరీరానికి డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి, కాలుష్యం యొక్క విష ప్రభావాలను తొలగిస్తుంది, ఇది శరీరం యొక్క సహజ డిటాక్స్ సూపర్ స్టార్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి రక్షణ: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, మొసాంబి మంట, వాపు నుండి రక్షణ, నివారణను అందిస్తుంది. ఈ అద్భుతమైన పండు ఆస్టియో ఆర్థరైటిస్,  రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడం: మూశంబి రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మీ కోరికలను అణచివేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల అదనపు కేలరీలు కరిగిపోతాయి. మోసంబి రసం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది: మెరిసే చర్మం పొందడానికి రోజూ ఒక గ్లాసు మోసాంబి జ్యూస్ తాగండి. ఇది మీ చర్మానికి మెరుపును ఇస్తుంది. మూసాంబిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్ పవర్‌తో, మీ చర్మం రక్షించబడి కాంతివంతంగా ఉంటుంది. మీ డల్ స్కిన్ కి గ్లో ఇస్తుంది. జీర్ణక్రియకు మంచిది: మోసంబి జ్యూస్ కేవలం దాహాన్ని తీర్చేది కాదు. సమతుల్య జీర్ణవ్యవస్థకు ఇది మంచి పానీయం. మీ జీర్ణ రసాలు శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందుతాయి. ఇది జీర్ణ రసాలు, ఆమ్లాలు, పిత్త స్రావాన్ని పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచే ఫ్లేవనాయిడ్ల యొక్క అధిక కంటెంట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల, అజీర్ణం, క్రమరహిత ప్రేగు కదలికలు, ఇతర జీర్ణశయాంతర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మోసంబి జ్యూస్ చాలా మేలు చేస్తుంది.

సిజేరియన్ ప్రసవాన్ని ఎంచుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి..!

సిజేరియన్ ప్రసవాన్ని ఎంచుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి..!   ప్రతి మహిళ గర్బం దాల్చడం,  ప్రసవించడం చాలా గొప్ప అనుభవం. వారికి ఒక కొత్త ప్రపంచాన్ని తెచ్చిపెడుతుంది ఈ దశ. అయితే ఈ రోజుల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. నేటి మహిళలు త్వరగా సిజేరియన్ చేయించుకుని ప్రసవం చేసుకోవాలని కోరుకుంటున్నారు.  సాధారణ ప్రసవం శ్రమతో, నొప్పితో కూడుకున్నదని, అందుకే సిజేరియన్ చేయించుకోవడం మంచిదని అనుకునేవారు చాలా ఎక్కువ.  అయితే చాలామంది మహిళలకు తెలియని షాకింగ్ నిజాలను గైనకాలజిస్టులు తెలిపారు.  సిజేరియన్ బెస్ట్ అనుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలేంటో తెలుసుకుంటే.. గతంలో సాధారణ ప్రసవాలు ఎందుకు సమస్య లేకుండా జరిగాయి? పాత కాలంలో మహిళలు ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకునేవారు. ఉదయం లేచిన తర్వాత ఇల్లు ఊడ్చడం, తుడవడం, బట్టలు ఉతకడం, మెట్లు ఎక్కడం,  వంట చేయడం,  ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తినడం వంటివి జరిగేవి.   అప్పట్లో ఏది తిన్నా జీర్ణమయ్యేది. అందుకే బరువు పెరగలేదు. ఇప్పట్లో బరువు పెరుగుదల.. ఇప్పటి కాలంలో మహిళలు కూడా నిశ్చలంగా ఉండే జీవనశైలిలో ఎక్కువ గడుపుతుంటారు. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు చూడటం, పుస్తకాలు చదవడం,  జంక్ ఫుడ్ లేదా చిప్స్ తినడం  చేస్తారు. శీతల పానీయాలు తాగడం కూడా సర్వసాధారణమైపోయింది. వీటికి తోడు వ్యాయామం లేకపోవడం కూడా బరువు పెరగడానకి దారి తీస్తుంది. సమస్య ఇదే.. శారరీక వ్యాయామాన్ని జీవనశైలి లో భాగం చేసుకోకపోవడం వల్ల  బరువు పెరగడం జరుగుతోంది. దీని వల్ల రక్తపోటు,  , మధుమేహం,  థైరాయిడ్ సమస్యలు గతంలో కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా, గర్భం ధరించాక ప్రసవానికి దగ్గర పడే కొద్ది  మహిళలు మానసికంగా బలహీనంగా మారతారు.  అందుకే చాలా మంది మహిళలు ప్రసవానికి ముందు ధైర్యం కోల్పోయి సిజేరియన్ డెలివరీని ఎంచుకుంటారు. మహిళల జీవనశైలి మారడం,  శారీరక శ్రమ లేకపోవడం సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. అందువల్ల, గర్భధారణ సమయంలో వీలైనంత చురుకుగా ఉండాలి.  శారీరకంగా చురుకుగా ఉండడం ద్వారా సి-సెక్షన్ కాకుండా సాధారణ డెలివరీ చాలా సులభంగా జరుగుతాయి.                              *రూపశ్రీ.

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు!

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు!   ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలో అయినా గొప్ప సందర్భం ఏదైనా ఉందంటే అది వారు తల్లికావడమే. నవమాసాలు మోసి బిడ్డను కంటారనే విషయం తెలిసిందే అయినా ఆ తొమ్మిది నెలలు మహిళలు తమ జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటార. ఆహారం దగ్గర నుండి శరీరాకృతి వరకు ప్రతి ఒక్కటీ మారిపోతుంది. అయితే ప్రసపం తరువాత పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం. సుమారు 6నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు కూడా చెబుతారు. అయితే తల్లిపాలు ఇవ్వడం గురించి చాలామంది మహిళలలో అపోహలు ఉన్నాయి. పాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని,  ఎన్ని నెలల వరకు పిల్లలకు పాలు ఇవ్వాలని, తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఏమిటని ఇలా చాలా విషయాలలో  అపోహలు, వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే అందరికీ ఈ విషయంలో ఒక అవగాహన ఏర్పడుతుంది. పాలివ్వడంలో అసౌకర్యం.. ప్రసవించిన తరువాత పిల్లలకు పాలివ్వడంలో ప్రతి తల్లీ అసౌకర్యానికి గురవుతుంది. పిల్లలు పాలు తాగడం లేదని, పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటుంటారు. అయితే మొదటిసారి ప్రసవం అయిన మహిళలకు పిల్లలను హ్యాండిల్ చేయడం, రొమ్ములకు దగ్గరగా పిల్లలను పెట్టుకోవడం, పిల్లలకు సౌకర్యంగా ఉండటం వంటి వాటిలో కాస్త విఫలం అవుతారు. ఇది రోజులు గడిచేకొద్ది అలవాటు అవుతుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు పెద్దల సహాయం తీసుకుంటే ఇందులో ఇబ్బంది చాలా వరకు అధిగమిస్తారు. పాలిచ్చే ముందు శుభ్రత.. చాలామంది పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములను, చనుమొనలను శుభ్రం చేసుకోవడం గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇలా శుభ్రం చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలు ప్రసవించిన తరువాత తల్లిని వాసన, స్పర్శ ద్వారా గుర్తిస్తారు. చనుమొనలలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని వాసన కారణంగా పిల్లలు తమ తల్లులను గుర్తిస్తారు. ఇది  పిల్లలకు  ఉపయోగకరమైనది. కాబట్టి పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదు. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగించకూడదు.. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగిస్తే అవి పిల్లలకు చెడు చేస్తాయని చాలామంది అంటారు. అయితే పాలిచ్చే తల్లులు తమ సమస్యలను వైద్యులతో చెప్పేటప్పుడు పిల్లలకు పాలిస్తున్న విషయాన్ని చెప్పాలి. దీన్ని బట్టి వైద్యులు ప్రత్యేక మందులు సిఫారసు చేస్తారు. వీటి వల్ల తల్లీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వైద్యులు సూచించిన విధంగానే మందులు తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. సొంతంగా మందులు వాడటం, వైద్యులు చెప్పిన నిర్ణీత కాలం కంటే  ఎక్కువ రోజులు  మందులు పొడిగించి వాడటం చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిపాలివ్వకూడదు.. తల్లులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలకు పాలివ్వకూడదని చాలా మంది అంటారు. అయితే ఇది తల్లులకు ఉన్న సమస్య పైన ఆధారపడి ఉంటుంది. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలో కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే  ఆహారం, పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం తల్లులకు ఎంతో ముఖ్యం. అనారోగ్యాన్ని బట్టి వైద్యుల సలహా మీద మాత్రమే పిల్లలకు పాలివ్వడం మంచిది. తల్లులకు పాల కొరత.. చాలామంది మహిళలు తమకు పాలు తక్కువ పడుతున్నాయని, పిల్లలకు సరిపోవడం లేదని ఫర్యాదు చేస్తుంటారు. అయితే ఇది చాలా వరకు అపోహే అని అంటున్నారు. బిడ్డను రొమ్ముపై సౌకర్యవంతంగా ఉంచుకుని పాలివ్వడంలోనే చాలావరకు పొరపాటు జరుగుతుందట. సౌకర్యవంతంగా పిల్లలకు రొమ్ము అందిస్తే పిల్లలు కూడా కడుపు నిండుగా పాలు తాగుతారు. అలాగే పిల్లలు పాలు ఎంత బాగా తాగితే తల్లులలో పాలు అంత బాగా ఉత్పత్తి అవుతాయి. ఆహారం.. పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో ఎలాంటి గందరగోళం చెందాల్సిన పనిలేదు. అందరిలానే పాలిచ్చే తల్లులు కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి. తల్లులు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారిలో పాలు ఉత్పత్తి కావడంలో సమస్యలు ఎదురే కావు. గమనిక: పై విషయాలు పోషకాహార నిపుణులు, మహిళా వైద్యులు పలుచోట్ల ప్రస్తావించిన అంశాల ఆధారంగా పొందపరచబడినవి.                                         *నిశ్శబ్ద. 

ఆయుర్వేదం ప్రకారం అమ్మాయిలు పీరియడ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఆయుర్వేదం ప్రకారం అమ్మాయిలు పీరియడ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..   పీరియడ్స్ అమ్మాయిలకు ఒక దశ వచ్చాక ప్రతి నెల పలకరిస్తుంటాయి.  నిజానికి చాలామంది పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పుల గురించి, అసౌకర్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ పీరియడ్స్ రాకపోయినా కంగారు పడాల్సిందే.  పీరియడ్స్ ప్రతినెలా కరెక్ట్ గా వస్తుంటేనే అమ్మాయిలలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  ఆయుర్వేదం అమ్మాయిల నెలసరి విషయంలో కొన్ని జాగ్రత్తలు సూచించింది.  అమ్మాయిలకు నెలసరి వచ్చాక మూడు రోజుల పాటు కొన్ని జాగ్రత్తలతో కూడిన నియమాలు తప్పనిసరి అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. మహిళలలో నెలసరి సమయంలో పునరుత్పత్తి ఆరోగ్యం, హార్మోన్లు, భావోద్వేగాల ఆరోగ్యంగా పేర్కొనే మానసిక  ఆరోగ్యం మొదలైనవి కాపాడటానికి 3రోజుల దినచర్యను ఆయుర్వేదం పేర్కొంది. దీన్నే ఋతు సంరక్షణ లేదా నెలవారీ రీసెట్ అని అంటారు. నెలవారీ రీసెట్ సూత్రం ప్రకారం.. పీరియడ్స్ సమయంలో ఎక్కువగా పనిచేయకూడదు.  ఒక పని చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల హార్మోన్ల ప్రవాహం ఆరోగ్యంగా ఉండి నెలసరి సమయంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పైన పేర్కొన్న కారణాల వల్లే నెలసరి వచ్చాక మొదటి మూడు రోజులు పూర్తీగా విశ్రాంతి తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది.  ఈ కారణంగానే నెలసరి వచ్చినప్పుడు మూడు రోజులు ఇంటి పనులకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ కదలకుండా ఒక చోట కూర్చుని విశ్రాంతి తీసుకోమని చెబుతారు. కానీ నేటి కాలం దీన్ని అర్థం చేసుకోకుండా వక్రీకరిస్తుంది. కొందరు ఈ మూడు రోజుల సమయంలో మహిళలకు విశ్రాంతి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ దుర్భాషలాడుతూ ఉంటారు.  మరికొందరు ఇంటి పనులకు దూరంగా ఉండాలనే విషయాన్ని అంటరానితనం తో చూస్తూ నెలసరి సమయంలో ఉన్న మహిళలను, అమ్మాయిలను మాటలతో చేష్టలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. నెలసరి సమయంలో మనస్సును,  శరీరాన్ని  ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల హార్మోన్లు ప్రశాంతంగా ఉంటాయి. మహిళల శరీరంలో వచ్చే మార్పులు అయినా, అనారోగ్యాలు అయినా చాలా వరకు హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వల్లనే వస్తుంటాయి. అందుకే నెలసరి సమయంలో మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం, జపం,  లేదా నిశ్శబ్ద సాధన వంటివి చేయడం చాలా సహాయపడతాయి. నెలసరి సమయంలో తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు,  వెచ్చని  ఆహారాలు తీసుకోవాలి. ఈ సమయంలో మరీ చల్లగా ఉన్న ఆహారం లేదా చాలా వేడిగా ఉన్న ఆహారం నిషేధించాలి. ఆహారంలో కిచిడి, గంజి, ఉడికించిన  కూరగాయలు, మజ్జిగ వంటివి బాగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు.. కారంగా ఉండే ఆహారాలు,  మాంసాహారం, మద్యం తీసుకోవడం, శీతలపానీయాలు అస్సలు తీసుకోకూడదు. జీర్ణం కావడానికి కష్టమైన ఆహారాలు తీసుకుంటే రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ఆయుర్వేదం  ప్రకారం శరీర ఉష్టోగ్రతను తల నియంత్రిస్తుందట. అందుకే నెలసరి వచ్చిన మూడు రోజులలో తలస్నానం చేయకూడదని చెబుతారు.  ఒక వేళ తలస్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత దెబ్బతిని రక్తస్రావ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందట. నెలసరి సమయంలో ఆయుర్వేదం చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే అది నెలసరి సమయంలో అధిక నొప్పి,  పిసిఓయస్ వంటి హార్మోన్ సమస్యలు,  పిల్లలు కనడంలో ఇబ్బందులు వంటివి రావడానికి కారణం అవుతాయని అంటున్నారు. ఆధునిక వైద్యశాస్త్రం కూడా నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవాలని, అది ఆరోగ్యం పై,  హార్మోన్ల పై ప్రభావం చూపించి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. ఈ సమయంలో గర్భాశయం మరమ్మత్తు చేయడం, రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి అంతర్గతంగా జరుగుతాయట. కాబట్టి ఆయుర్వేదం చెప్పిన జాగ్రత్తలు, నియమాలు తప్పనిసరిగా పాటించడం మంచిది.                                    *రూపశ్రీ.  

నవరాత్రి సమయంలో గర్భవతులు ఏం చేయాలి..ఏం చేయకూడదు!

నవరాత్రి సమయంలో గర్భవతులు ఏం చేయాలి..ఏం చేయకూడదు!     నవరాత్రి భక్తితో జరుపుకునే తొమ్మిది రోజుల పండుగ.  సాధారణంగా మహిళలు నవరాత్రులను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి రోజూ అమ్మవారి ఆరాధన, నైవేద్యం, ఉపవాసాలతో గడుస్తూ ఉంటుంది. అయితే సాధారణ మహిళలు అయితే ఇలా ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని ఆరాధిస్తారు.  కానీ గర్భవతులు మాత్రం ఇంలాటి విషయాలలో చాలా శ్రద్ద తీసుకోవాలి. కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్న సమయంలో ఉపవాసాల విషయంలో నిర్లక్ష్యం చేయడం,  వైద్యుల సలహా లేకుండా ఉపవాసాలు ఉండటం చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది తల్లికి,  కడుపులో బిడ్డకు కూడా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది.  నవరాత్రుల సందర్భంలో గర్భవతులు చేయాల్సినది ఏంటి? చేయకూడనిది ఏంటి? తెలుసుకుంటే.. ఉపవాసానికి ఉండాలంటే.. గర్భిణీ స్త్రీలు నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండాలని అనుకుంటే మొదట  వైద్యుడిని సంప్రదించాలి. గర్భవతులు రోజంతా ఉపవాసం ఉండటం మంచిది కాదు.  ఒకవేళ ఉండాలని అనుకుంటే.. అది కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండేవారు అయితే   రోజంతా ఉపవాసం ఉండే బదులు పండ్లు, పాలు వంటి తేలికపాటి ఆహారాలు తినండి . పోషకాలు.. ఉపవాసం ఉన్నప్పుడు  ఆహారంలో తగినంత పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, కాల్షియం , ఐరన్,  ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. వీటిని ఎట్టి పరిస్థితులలో తగ్గించడం లేదా అసలు తీసుకోకుండా ఉండటం లాంటివి చేయకూడదు. పండ్లు, గింజలు, పాలు, పెరుగు, జున్ను తినాలి. శారీరక శ్రమ.. నవరాత్రి సమయంలో  సాధారణంగా ఇంటి పనులు, వంట పనులు, నైవేద్యాల తయారీ, దేవుడి అలంకరణ, పూజ వంటివి ఉంటాయి. ఇంకా పెద్ద పట్టణాలలో అయితే ప్రత్యేక ఈవెంట్లు కూడా ఏర్పాటు చేస్తుంటారు.  అయితే  గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తేలికపాటి పనులు మాత్రమే చేయాలి. ఇక రెండవ,  మూడవ త్రైమాసికంలో వీటిని నివారించాలి . పూజలలో జాగ్రత్తలు.. సాధారణంగా పూజల సమయంలో ఎక్కువ సేపు కూర్చోవడం లేదా ఎక్కువ సేపు నిలబడటం వంటివి ఉంటాయి. కానీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అలాగే పూజల పేరుతో ఎక్కువగా అలసిపోకూడదు. అలాగే దేవతా ఊరేగింపులు,  సమూహ పూజలు వంటివి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతి,  నిద్ర.. గర్భధారణ సమయంలో నిద్ర చాలా ముఖ్యం . నవరాత్రి ఉత్సవాల్లో  నిద్ర విషయంలో రాజీ పడకూడదు. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.  అలాగే  పగటిపూట కొంత విశ్రాంతి తీసుకోవాలి. అలసట అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. నిర్లక్ష్యం వద్దు.. నవరాత్రుల సమయంలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినా సమస్యగా ఉన్నట్టు అనిపించినా అవన్నీ పండుగ హడావిడిలో వచ్చాయి, తర్వాత తగ్గిపోతాయి  అనే నిర్లక్ష్యంతో ఉండకూడదు. వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                   *రూపశ్రీ.

మెనోపాజ్ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం.. నిజమేనా..!

మెనోపాజ్ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం.. నిజమేనా..! ప్రతి మహిళ జీవితంలో మెనోపాజ్ అనేది  ఒక ముఖ్యమైన దశ. అప్పటి వరకు ఎదుర్కొన్న ఋతుచక్రం మెల్లగా నెమ్మదించి ఆగిపోతుంది.  ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మార్పులను తెస్తుంది. ఈ సమయంలో,శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే ఈ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు. ఇది నిజమేనా? ఒకవేళ నిజం అయితే దీనికి పరిష్కారం ఏమిటి? తెలుసుకుంటే.. మెనోపాజ్ తర్వాత  గుండెపోటు ప్రమాదం ఎందుకు? మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి వేగంగా తగ్గుతుంది. ఈ హార్మోన్ గుండెను సురక్షితంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల  కొలెస్ట్రాల్,  రక్తపోటు పెరుగుతుంది. ఇది ధమనులలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది . 45 నుండి 55 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. ఇవన్నీ గుండెపోటు లక్షణాలే.. చాలా సార్లు మహిళలు గుండెపోటు  ప్రారంభ లక్షణాలను సాధారణ అలసట లేదా బలహీనతగా భావించి లైట్ తీసుకుంటారు. ఛాతీ లేదా ఎడమ చేతిలో నొప్పి ఉండటం,  శ్వాస ఆడకపోవడం, ఆకస్మిక చెమట, తలతిరగటం.. మొదలైన సంకేతాలన్నీ గుండెపోటును సూచిస్తాయి. జాగ్రత్తలు.. మెనోపాజ్ తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం  ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు . ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  ఆహారంలో తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు,  ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  ప్రతిరోజూ 30 నిమిషాలు నడక , యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెనోపాజ్  సమయంలో ఒత్తిడి పెరుగుతుంది.  కాబట్టి ధ్యానం,  ప్రాణాయామం చేయాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.  రక్తపోటు , కొలెస్ట్రాల్,  చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. తగినంత నిద్ర పోవాలి.  రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం నివారించాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.  ఇప్పటికే డయాబెటిస్ లేదా రక్తపోటు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.                                 *రూపశ్రీ.

గర్భధారణ సమయంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ ఇదే..!

గర్భధారణ సమయంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ ఇదే..! గర్భధారణ సమయంలో గర్భవతుల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్ లలో బయోటిన్ ఒకటి.  విటమిన్ బి 7 అని కూడా పిలువబడే బయోటిన్ నీటిలో కరిగే బి-కాంప్లెక్స్ విటమిన్. ఇది గర్భధారణ సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పిండం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది,  శక్తి ఉత్పత్తిని పెంచుతుంది, జీవక్రియకు సహాయపడుతుంది,  ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు,  గోళ్ళ కు సహాయపడుతుంది. అయితే  గర్భధారణ సమయంలో బయోటిన్ లోపం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ప్రినేటల్ డైట్లో చేర్చడం వల్ల తల్లి,  పిండం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అసలు బయోటిన్ గర్భవతులకు ఎందుకంత ముఖ్యం? బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు ఏవి? తెలుసకుంటే.. గర్భం దాల్చినప్పుడు  శరీరానికి  పోషకాల అవసరం పెరుగుతుంది.   బయోటిన్ కూడా ఇందులో ఒక భాగం. ఇది పిండం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.  సెల్యులార్ పెరుగుదలకు అవసరమైన ఎంజైమ్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ బయోటిన్  ఉంటే పిల్లలకు  పుట్టుకతో  లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం గర్భవతులకు చాలా ముఖ్యం. గుడ్డు పచ్చసొన.. గుడ్డు పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. కేవలం ఒక ఉడికించిన గుడ్డు పచ్చసొన మంచి మొత్తంలో బయోటిన్ ను అందిస్తుంది. గర్భధారణ సమయంలో సాల్మొనెల్లా ప్రమాదాన్ని నివారించడానికి గుడ్లు పూర్తిగా ఉడికించి తినాలి.  గింజలు, విత్తనాలు.. బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు,  వేరుశెనగలో బయోటిన్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్ కూడా ఉంటాయి. చిరుతిండిగా చిన్న గుప్పెడు విత్తనాలు తీసుకుంటే బయోటిన్  అందుతుంది. చిలకడదుంపలు.. విటమిన్లు, ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు చిలకడదుంపలలో పుష్కలంగా ఉంటాయి.  వీటిలో విటమిన్-ఎ కంటెంట్ కూడా మెరుగ్గా ఉంటుంది.  ఇది పిండం కంటి ఆరోగ్యానికి,  చర్మ అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తుంది.  అరటిపండ్లు.. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది,  బయోటిన్ మితంగా ఉంటుంది. అరటిపండు మంచి శక్తిని ఇస్తుంది.  మొదటి త్రైమాసికంలో అనారోగ్యం లేదా వికారంతో ఇబ్బంది పడేటప్పుడు ఇవి బాగా  సహాయపడతాయి. పాలకూర.. పాలకూరలో గర్భధారణకు అవసరమైన ఐరన్, ఫోలేట్,  పుష్కలంగా ఉంటాయి. తే  తృణధాన్యాలు.. గోధుమలు, వోట్స్,  బ్రౌన్ రైస్ లలో ఫైబర్, ఐరన్,  బి-కాంప్లెక్స్ విటమిన్లతో పాటు మితమైన స్థాయి బయోటిన్ కలిగి ఉంటుంది.  పాల ఉత్పత్తులు.. పాలు, పెరుగు,  జున్నులలో  కాల్షియం,  ప్రోటీన్ మాత్రమే కాకుండా బయోటిన్  కూడా ఉంటుంది. ఇవి గర్భవతులకు మంచివి.                                *రూపశ్రీ.

నెలసరి సమయంలో పొట్ట సంబంధిత సమస్యలకు.. ప్రేగు ఆరోగ్యం ఇలా చెక్ పెట్టవచ్చు..!

నెలసరి సమయంలో పొట్ట సంబంధిత సమస్యలకు.. ప్రేగు ఆరోగ్యం ఇలా చెక్ పెట్టవచ్చు..! సాధారణ రోజుల కంటే.. నెలసరి సమయంలో మహిళలు  చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటారు.  వాటిలో పొట్ట సంబంధ సమస్యలు ఎక్కువ.  హార్మోన్ల మార్పుల వల్ల ప్రోస్టాగ్లాండిన్లు,  ప్రొజెస్టెరాన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.  వీటి వల్ల నెలసరి సమయంలో పొట్ట సంబంధ సమస్యలు వస్తాయి.   ఈ హార్మోన్లు జీర్ణక్రియ,  ప్రేగు కదలికలను ప్రభావితం చేస్తాయి. ఇది విరేచనాలు, మలబద్ధకం, ఉబ్బరం లేదా పొత్తికడుపు తిమ్మిరి వంటి లక్షణాలకు దారితీస్తుంది. అయితే నెలసరి సమయంలో ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. హైడ్రేటెడ్ గా ఉండాలి.. నీరు పుష్కలంగా త్రాగడం వల్ల మలబద్ధకం నివారించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది అదనపు సోడియంను బయటకు పంపడం ద్వారా ప్రేగు కదలికలు ఆరోగ్యంగా ఉండేలా చేసి  ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.   ఫైబర్ ఆహారాలు.. ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు,  కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. కరిగే ఫైబర్ అదనపు నీటిని పీల్చుకోవడం ద్వారా విరేచనాలను తగ్గిస్తుంది. కరగని ఫైబర్ మలబద్ధకం రాకుండా చేస్తుంది. కెఫిన్,  చక్కెర పానీయాలు.. కెఫీన్ ప్రేగులను ఎక్కువగా ప్రేరేపిస్తుంది. విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తుంది, చక్కెర పానీయాలు ఉబ్బరాన్ని, గ్యాస్ ను పెంచుతాయి.   పాల ఉత్పత్తులు.. కొంతమందికి  పీరియడ్స్ సమయంలో  లాక్టోస్ అసహనం పెరుగుతుంది. పాలు తాగిన తరువాత  గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతుంటే..పాలు, పాల ఉత్పత్తులు మానేయాలి.  ప్రోబయోటిక్స్.. పెరుగు, కేఫీర్ లేదా పులియబెట్టిన కూరగాయలు వంటి ఆహారాలు ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాకు మద్దతు ఇస్తాయి, ఇవి జీర్ణక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి యాక్టీవ్.. నడక లేదా యోగా వంటివి జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి.  ఉబ్బరాన్ని,  మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఇది మొత్తం నెలసరి నొప్పి,  మానసిక స్థితి నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఆహారం.. భారీ భోజనం కాకుండా తేలికైన భోజనం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇది  జీర్ణవ్యవస్థను బాగా తట్టుకోవడానికి సహాయపడుతుంది.  ఉబ్బరం లేదా  ప్రేగు ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇవి తినొద్దు.. జిడ్డు,  కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి కడుపులో చికాకు కలిగించి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి, విరేచనాలు లేదా కడుపు తిమ్మిరి వచ్చే అవకాశాలను పెంచుతాయి.  పీరియడ్స్ సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.  హీటింగ్ ప్యాడ్.. వేడి కాపడం  లేదా హీటింగ్ ప్యాడ్ తిమ్మిరి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా  పేగు కండరాలను సడలించి, ప్రేగు కదలికలను , పొట్ట  అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.                *రూపశ్రీ.

ప్రసవం తరువాత మహిళల్లో ఎదురయ్యే కీళ్ళ నొప్పులకు అధ్బుతమైన పరిష్కారాలు!!

ప్రసవం తరువాత మహిళల్లో ఎదురయ్యే కీళ్ళ నొప్పులకు అధ్బుతమైన పరిష్కారాలు! మహిళలకు ప్రసవం చాలా గొప్ప వరం.   అమ్మతనాన్ని మహిళలు ఎంతగానో అనుభూతి చెందుతారు. అయితే ప్రసవం తరువాత మహిళలు ఎదుర్కొనే సమస్యలు వేరు ఉంటాయి. ఇవి శారీరక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు. ప్రసవ సమయంలో మహిళలు బరువు పెరగడం, బిడ్డను కూడా మోయడం వల్ల మహిళల శరీర బరువు కీళ్లు, ఎముకల మీద చాలా ఎక్కు వ పడుతుంది. ఇక ప్రసవ సమయంలో కూడా ఈ కీళ్లు ఒత్తిడికి లోనవుతాయి. ఈ కీళ్ళ నొప్పులను భరించడం కష్టం. ఇందుకోసం మెడిసిన్స్  వాడక్కర్లేదు. ఇంట్లోనే సులువుగా ప్రసవానంతర కీళ్ళ నొప్పులు తొలగించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. మెంతులు మహిళల్లో ప్రసావానంతర కీళ్ల నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందుకోసం మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మెంతి గింజలను తిని, నీటిని తాగాలి. మెంతికూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ నొప్పులను దూరం చేయడంలో సహాయపడాయి. మెంతులు మాత్రమే కాకుండా ప్రసవానంతర కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి పాటించవలసిన మరొక అధ్బుతమైన చిట్కా పసుపు. పసుపు గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రసవం తరువాత మహిళలు కీళ్ళ నొప్పులు మాత్రమే కాదు శరీరంలో ఎక్కడైనా వాపు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నా పసుపు ప్రయోజనకరంగా పనిచేస్తుంది.  ప్రతి రోజు పాలలో కాసింత పసుపు కలిపి తాగుతూండాలి. ఇది మాత్రమే కాకుండా కీళ్లు, ఇతర ప్రాంతాల్లో నొప్పి, వాపు ఉన్నచోట పసుపు ముద్దను పూయవచ్చు. ఇది నొప్పులు, మంట, వాపు తగ్గడంలో సహాయపడుతుంది. గర్బం మోయడం, ప్రసవం కారణంగా మహిళల శరీరం చాలా మార్పులకు, ఒత్తిడికి లోనై ఉంటుంది. ఈ కారణంగా మహిళలు బాగా అలసిపోయి ఉంటారు. మహిళలకు వీలైనంత విశ్రాంతి అవసరం అవుతుంది. అంతేకానీ ప్రసవం తరువాత  రోజుల వ్యవధిలోనే ఎక్కువ పనులు చేయడం చేయకూడదు. ప్రతిరోజు వీలైనంత విశ్రాంతి, మార్పులకు లోనైన శరీరానికి తేలికపాటి వ్యాయామం అవసరం. అయితే వ్యాయామం విషయంలో వైద్యులను సంప్రదించిన తరువాతే మొదలుపెట్టాలి. ప్రపంచదేశాలు ఇష్టంగా తాగే డ్రింక్స్ లో కాఫీ ప్రథమ స్థానంలో ఉంటుంది. కప్పుల కొద్ది కాఫీ సిప్ చేస్తూ పనులు చక్కబెట్టేవారు ఎందరో. కానీ ప్రసవం తరువాత మహిళలు కాఫీ తాగడం మానుకోవాలి. కాఫీ తాగడం వల్ల ప్రసవానంతరం కలిగే కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. పైన చెప్పుకున్నవన్నీ ప్రసవం తరువాత మహిళలు పాటిస్తే ప్రసవానంతరం ఎదురయ్యే కీళ్ళ నొప్పులు ఎక్కవరోజులు ఇబ్బంది పెట్టకుండా చాలా తొందరగా తగ్గిపోతాయి.                                                       *నిశ్శబ్ద.  

ఈ ఒక్క సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది..!

ఈ ఒక్క సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది..!   ప్రతి జబ్బు మనిషికి ఏదో ఒక అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని తక్కువ ప్రమాదం కలిగి ఉంటే.. మరికొన్ని ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటాయి.  ఇంకా ఈ వ్యాధులు కూడా మగవారికి వేరుగానూ,  ఆడవారికి వేరుగానూ కొన్ని ఉంటాయి. అయితే.. మహిళలలో వచ్చే ఒకే ఒక సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటి? ఇదెలా గర్భస్రావాలకు కారణం అవుతుంది తెలుసుకుంటే.. థైరాయిడ్ లోపం (హైపోథైరాయిడిజం). ఇది మహిళల పీరియడ్స్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా గర్భధారణకు కూడా ఆటంకం కలిగిస్తుంది. థైరాయిడ్ కారణంగానే 10 మందిలో కనీసం  నలుగురికి  గర్భస్రావాలు జరుగుతాయని, ముఖ్యంగా మొదటి మూడు నెలల్లోనే జరుగుతాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. థైరాయిడ్ లోపం ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయని గైనకాలజిస్ట్ లు  చెబుతున్నారు. సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కొంతమందిలో ఈ సమస్యను సకాలంలో నిర్వహించకపోతే.. ఇది పదేపదే గర్భస్రావాలు అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని  గైనకాలజిస్ట్ లు అంటున్నారు . అదే సమయంలో ఇది దీర్ఘకాలికంగా సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని  హైపోథైరాయిడిజం అని అంటారు, అంటే థైరాయిడ్ లోపం. థైరాయిడ్ లోపం ఉన్నవారికి ఆకలి వేయకపోవడం అనే లక్షణం ఉంటుంది. దీన్ని బట్టి ఈ సమస్య మీద అనుమానించి వైద్యుల దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయింటుకోవచ్చు. ఆకలి వేయకపోయినా, ఆహారం ఎక్కువ తినకపోయినా వీరు బరువు పెరుగుతూ ఉంటారు. నెలసరి ఆలస్యం.. థైరాయిడ్ లోపం వల్ల పీరియడ్స్ రాకపోవడం లేదా సకాలంలో రాకపోవడం జరుగుతుంది.  రెండు నుండి మూడు నెలలకు ఒకసారి  పీరియడ్స్ వస్తాయి. అదే సమయంలో కొంతమంది గర్భం దాల్చలేరు. మహిళలు  గర్భవతి అయినప్పటికీ, బిడ్డ హృదయ స్పందన రాదు,  హృదయ స్పందన వచ్చినప్పటికీ, మొదటి మూడు నెలల్లో రక్తస్రావం కారణంగా గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి . ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే మహిళలు చేయాల్సిన పని ఇదీ..  మహిళలు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటే, ముందుగా  థైరాయిడ్ హార్మోన్‌ను తనిఖీ చేసుకోవాలి. అలాగే  ఈ హార్మోన్ లోపం ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి వైద్యుల సహాయంతో  సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా  గర్భస్రావం జరగకుండా ఆపవచ్చు.                           *రూపశ్రీ.

గర్భవతులను డేంజర్ జోన్ లోకి తోసేసే ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా..

గర్భవతులను డేంజర్ జోన్ లోకి తోసేసే ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా..    గర్భం దాల్చడం,  బిడ్డను మోయడం,  బిడ్డకు జన్మనివ్వడం, మాతృత్వాన్ని ఆస్వాదించడం.. ఇవన్నీ ఒక మహిళ తన జీవితంలో కోరుకునే అత్యంత విలువైన విషయాలు. అయితే గర్భం విషయంలో నేటి కాలంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళలకు పెద్ద సవాళ్లు విసురుతున్నాయి.  వాటిలో ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు.  అసలు ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?   ఇది గర్భవతులను డేంజర్ జోన్ లోకి నెట్టివేస్తుంది ఎందుకు?  తెలుసుకుంటే.. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు  పిండం సాధారణంగా గర్భాశయంలోనే అభివృద్ధి చెందుతుంది. కానీ గర్భిణీ స్త్రీ  పిండం ఆమె గర్భాశయంలో కాకుండా ఆమె కాలేయంలో పెరగడం గురించి ఎప్పుడైవా విన్నారా?  గర్భాశయంలో పెరగాల్సిన పిండం కాలేయంలో పెరగడాన్ని ఒక్కసారి ఊహించుకోండి.. చాలా భయానకంగా అనిపిస్తుంది కదా.. . ఇది వినడానికి  ఆశ్చర్యంగా అనిపించినా ఇలాంటి షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లే వెలుగులోకి వచ్చింది  . అక్కడ ఒక మహిళ కాలేయంలో  పిండాన్ని వైద్యులు కనుగొన్నారుప. ఇది చాలా అరుదైన,  ప్రమాదకరమైన పరిస్థితి.  దీన్ని  ' ఇంట్రా హెపాటిక్ ప్రెగ్నెన్సీ ' అంటారు . ఇందులో,పిండం గర్భాశయంలో కాకుండా కాలేయంలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది . దీనివల్ల కాలేయం చీలిపోయే ప్రమాదం ఉంటుంది.   తద్వారా  తల్లి చనిపోవచ్చు కూడా అని వైద్యులు అంటున్నారు. సాధారణంగా గర్భధారణ సమయంలో పిండం తల్లి గర్భాశయం లోపల పెరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు పిండం ఫెలోపియన్ ట్యూబ్, ఉదర కుహరం , అండాశయం లేదా కాలేయం వంటి ఇతర అవయవాలలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు.  పిండం కాలేయంలో ఏర్పడినప్పుడు దానిని ప్రత్యేకంగా ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ అంటారు. కారణమేంటి..? మహిళలలో ఫెలోపియన్ ట్యూబ్  పగిలిపోవడం లేదా పిండం తప్పు దిశలో సెట్ కావడం ఈ సమస్యకు కారణం కావచ్చు. పిండం ఉదర కుహరంలోకి పడి రక్త ప్రవాహాన్ని అందించే అవయవానికి అతుక్కుపోతుంది.   కాలేయం రక్తంతో కూడిన అవయవం కాబట్టి పిండం అక్కడ అభివృద్ధి చెందగలదు. అదనంగా IVF లేదా ఇతర సంతానోత్పత్తి పద్ధతులను ఉపయోగించే స్త్రీలు, ఫెలోపియన్ ట్యూబ్‌లపై ఇన్ఫెక్షన్ లేదా శస్త్రచికిత్స హిస్టరీ కలిగి ఉంటారు.లేదా గతంలో శస్త్రచికిత్స లేదా ఉదరానికి గాయం అయిన స్త్రీలు ఇంట్రాహెపాటిక్ గర్భధారణకు ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారు. లక్షణాలు.. ఈ గర్భధారణ లక్షణాలు పొట్ట  కుడి ఎగువ భాగంలో తీవ్రమైన నొప్పి, అసాధారణ రక్తస్రావం, వాంతులు, వికారం, తలతిరుగుతున్నట్లు లేదా మూర్ఛపోవడం. కాలేయం చుట్టూ వాపు లేదా ఒత్తిడి అనుభూతి కూడా ఈ పరిస్థితికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు ప్రారంభ దశలో సాధారణ గర్భధారణ లక్షణాల నుండి భిన్నంగా ఉంటాయి.  కాబట్టి గుర్తింపు కష్టం కావచ్చు. నష్టాలు.. ఈ  గర్భధారణలో అత్యంత తీవ్రమైన ప్రమాదం కాలేయం చీలిపోవడం. ఎందుకంటే ఇది రక్తంతో నిండిన ముఖ్యమైన అవయవం. గర్భంలో పిండం పరిమాణం పెరిగినప్పుడు, అది కాలేయంపై ఒత్తిడి తెస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే కాలేయం చీలిపోవచ్చు. ఇది భారీ అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది,  తల్లి మరణానికి కూడా దారితీస్తుంది. ట్మీట్మెంట్.. ఇంట్రాహెపాటిక్ గర్భధారణను పూర్తి కాలంలో చికిత్స చేయలేము. ఇది నిర్ధారించబడిన వెంటనే వైద్యులు మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా పిండాన్ని తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తారు. సమస్య సీరియస్ గా ఉన్నప్పడు పాక్షిక కాలేయ శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. సకాలంలో చికిత్స మాత్రమే స్త్రీ ప్రాణాలను కాపాడుతుంది. దీని గురించి మహిళలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.                                   *రూపశ్రీ.

మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!

మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!      ఇప్పటికాలంలో అమ్మాయిలు జుట్టు రాలడమనే సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సరైన కారణాన్ని తెలుసుకోకుండా కనిపించిన మార్గమల్లా ఫాలో అవ్వడంతో కేవలం జుట్టు రాలే సమస్య కాస్తా జుట్టు పలుచగా, సున్నితంగా మారిపోవడానికి, జీవం కోల్పోవడానికి కారణం అవుతుంది. అయితే దీనికి అసలు కారణం.. కారణానికి తగిన పరిష్కారం తెలుసుకుంటే.. శరీరంలో కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ లోపించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. రోజురోజుకూ తమ జుట్టు పల్చబడి పొడిబారడంతోపాటు చిట్లిపోతుందని కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కారాలను వెతుక్కుంటూ చాలామంది బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, కొన్నిసార్లు, శరీరంలో ఇదొక్కటి తగినంత మొత్తంలో లేకపోవడం వల్ల జుట్టురాలిపోవడం జరుగుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నుండి శరీరంలో వివిధ రకాల విధులను సజావుగా నిర్వహించడం వరకు సహాయపడేది ఇదే.. ఇంత ప్రముఖ పాత్ర పోషించే పదార్థమే ఒమేగా-3 ఫ్యాట్స్..   జుట్టు రాలే సమస్య బాగా  ఎదుర్కొంటుంటే లేదా మీ జుట్టు పలుచబడటం లేదా పొడిగా,  పెళుసుగా ఉన్నట్లు అనిపిస్తే, ఒమేగా-3 తీసుకోవడం గురించి ఆలోచించాల్సిందే.. ఒమేగా-3 కొవ్వులు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, అవి  జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. జుట్టు చక్కగా.. అందంగా, మందంగా లేకపోతే  ఒమేగా-3 శరీరానికి తగిన మోదాదులో అందడం లేదని అర్థం. ఇలాంటి  పరిస్థితిలో  తప్పనిసరిగా తినవలసిన ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచించారు.  నెయ్యి, ఆలివ్ నూనె, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు,  చియా విత్తనాలు ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. ఇవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మొత్తం జుట్టు నాణ్యతను పెంచుతుంది. ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు కాకుండా, మీ జుట్టుకు మంచి చేసే ఇతర ఆహారాలు.. గుడ్లు, బచ్చలికూర,  గింజలు, నల్ల శనగలు,  అవకాడోలు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు మొదలయినవి.                                                                                                              ◆ నిశ్శబ్ద

కూర్చోవడం వల్ల వచ్చే కష్టాలు

కూర్చోవడం వల్ల వచ్చే కష్టాలు 1. కుర్చీలోంచి కదలకుండా ఓ అరగంట కుర్చున్నారో...అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నిజానికి స్థిరంగా కూర్చోటమన్నది మానవులకు సరిపడదుట. అలా కదలకుండా కూర్చున్నప్పుడు మన శరీరంలోని ఎల్.పి.ఎల్ పనితీరు మందగిస్తుదట. ఎల్.పి.ల్ పనితీరు మందగిస్తే నష్టం ఏంటి అంటారా! ఈ ఎల్.పి.ఎల్ వ్యాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తూ, రక్తంలోని చెడు కొలస్ట్రాల్ ను పీల్చుకుని కండరాల రూపంలోకి మారుస్తుంది, సో కదలకుండా కూర్చున్నపుడు ఈ ప్రక్రియ అంతా మందగిస్తుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాలలో నిల్వ ఉండిపోతుంది. అందుకే ఎక్కువ సేపు అలా కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి పొట్ట త్వరగా వచ్చేది. 2). సహజంగానే ఆడవారికి పిల్లలు పుట్టాకా కాస్త నడుము, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే పనిగా కూర్చుని ఉద్యోగాలు చేసే వారి గురించి ఇక చెప్పేదిముంది. అవునూ ఇంతకీ పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే ఏమన్నా ఇబ్బందా అన్న డౌట్ వస్తోంది కదా! ఖచ్చితంగా దాని వలన ఇబ్బందే. పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైనదిట. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హార్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి. రక్తనాళాలు పూడుకు పోవటం, స్థూలకాయం అధికరక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం వుందని హేచ్చరిస్తున్నారు పరిశోదకులు. 3) చాలా సేపు కదలకుండా కూర్చుంటే ఆరోగ్యనికి మంచిది కాదు. కండరాలు క్రమేపి బిగుసుకుపోవటం, వెన్నుముక, భుజాలు, తుంటి సమస్యలు రావటం వంటి ప్రమాదాలు పొంచి వుంటాయట. అదేపనిగా ఒకేచోట కదలకుండా కూచునేవాళ్ళకి రోజు మొత్తం మీద ఒకేచోట  మూడుగంటలని మించి కూర్చోకూడదు. అదీ తప్పని సరైతే తప్ప. వీలునప్పుడు ప్రతీ అరగంటకి ఓసారి లేచి అటుఇటు కాసేపు తిరగటం మంచిది. లేదంటే ఇట్టే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం వుందని తేల్చిచెప్పారు అమెరికన్ పరిశోధకులు. ఇందుకుగాను సుమారు 1.20 లక్షల మందిని పరిశీలించారు. వారి జీవనశైలి, ఎంతసేపు ఒకేచోట కూర్చుంటున్నారు వంటి విషయాలని పరిశీలించారు. విశ్రాంతి సమయంలోనైన రోజుకి 3 గంటలకి పైగ కదలకుండా కూర్చునే వాళ్ళలో గండె జబ్బులు వంటివి రావటం గమనించారట. ఎట్టి పరిస్తితిలో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చో వలసి వస్తే మాత్రం మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగటం మంచిది. 4) మన అలవాట్లే మనల్ని కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకేచోట కూర్చోవటం కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తే కంప్యూటర్ దగ్గర అదే పనిగా ఎక్కువసేపు  గడిపితే మరో ప్రమాదం పొంచి వుంది. ఈ మధ్య మహిళలు కూడా కంప్యూటర్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర ఉండే ఆడవారికి ముఖం మడతలు పడటం, కళ్ళు జీవాన్ని కోల్పోవడం, వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం వుందటున్నారు నిపుణులు. తీవ్రమైన రేడియేషన్ కారణంగా కంటి కింద వలయాలు రావటంతో పాటు చర్మ సాగి ముడతలు పదే ప్రమాదం కూడా ఉందట. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు ఉండవలసి వచ్చినపుడు మధ్య మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవటం తప్పని సరట. -రమ

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా...

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా... చాలామంది మహిళలలో తరచుగా వినిపించే ఫిర్యాదు నడుమునొప్పి. నడుమునొప్పి అనేది ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వాచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు వయసుతో సంబంధం లేకుండా నడుమునొప్పి వచ్చేస్తోంది. నడుమునొప్పి నివారణ కోసం ఎన్నో రకాల మందులు, పెయిన్ రిలీఫ్ జెల్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని కారణం తెలుసుకుంటే దీన్ని నివరించుకోవడం అందరి చేతుల్లోనే ఉంది. మరి నడుము నొప్పి ఎలా వస్తుంది దానికి కారణం ఏమిటి వంటి వివరాలు తెలుసుకుంటే… నడుమునొప్పి ఎలా వస్తుంది?ఎందుకు వస్తుంది? నడుము  అనేది శరీరానికి మధ్యభాగంలో ఉన్న అవయవం. కడుపు పై భాగం నుండి ఉన్న బరువు మొత్తం నడుము మీద పడుతూ ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు లేదా సాధారణంగా అలవాటు ప్రకారము వంగినప్పుడు నడుము భాగం వంచుతూ ఉంటాం. ఫలితంగా నడుము భాగం ప్రభావానికి గురవుతుంది. నడుము వంచిన భంగిమ లేదా నడుము మీద బరువు పడే ప్రాంతాన్ని బట్టి నడుము ప్రాంతం ఒత్తిడికి లోనయ్యి నొప్పి వస్తుంది. ఒకే వైపు బరువు పడటం, ఒకే వైపు వంగి కూర్చోవడం, ఒకే వైపు బరువులు ఎత్తడం, నడవడంలో కూడా ఒకేవైపు బెండ్ కావడం వంటివి జరిగినప్పుడు నడుము ప్రభావానికి గురయ్యి నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వచ్చే కొన్ని కారణాల, వాటి నివారణకు మార్గాలు ఉన్నాయి… కూర్చునేటప్పుడు:- కూర్చునేటప్పుడు   వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. దీనివల్ల శరీరం సమాంతరంగా ఉండి బరువు ఒకే ప్రాంతంలో పడకుండా ఉంటుంది. నడుము నొప్పి రాకుండా ఉండటం కోసం మాత్రమే కాకుండా నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా వీలైనంతవరకు ఇలా కూర్చోవడం అలవాటు చేసుకుంటే నడుమునొప్పి తగ్గిపోతుంది.  చాలామంది బరువులు ఎత్తుతూ ఉన్నపుడు కాళ్ళను నిటారుగా ఉంచుతారు. ఇలా ఎత్తేటప్పుడు నడుము మీద చాలా ఒత్తిడి పడుతుంది. నడుము భాగంలో కండరాలు, ఎముకలు బిగుసుకున్నట్టు అవుతాయి. అయితే ఇలా బరువు ఎత్తేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కాస్త తప్పిన అది నడుము మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.   కాబట్టి బరువులు ఎత్తేటపుడు కాళ్ళను 'మోకాళ్ళవద్ద వంచి, బరువులు ఎత్తాలి.  ఇకపోతే నిలబడినప్పుడు కూడా పద్దతిగా నిలబడాలి. కొండస్రు నిలబడినప్పుడు బరువు మొత్తం ఒక కాలు మీద వేసి నిలబడటం, లేదా ఒకవైపుకు వంగి నడుము ఒకవైపు భాగం మీద బరువు వేయడం, ఒకవైపు మాత్రమే నడుము వంచి ఎక్కువ సేపు ఉండటం వంటివి చేస్తుంటారు. దీనివల్ల నడుమునొప్పి చాలా తొందశరగా వస్తుంది. కాబట్టి నిలబడినట్టు అటు ఇటు బెండ్ అవ్వకుండా నిటారుగా నిలబాడ్స్ట్స్మ్ ఎంతో ముఖ్యం. పడుకునే సమయంలో కూడా భంగిమ ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవైపుకు తిరిగి పడుకోవడం లేదా పడుకున్న తీరు ఏదైనా శరీరం అస్తవ్యస్తంగా కాకుండా కాస్త నిటారుగా ఉండటం ముఖ్యం. లేకపోతే శరీరం అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిద్రపోతే నడుము భాగంలో కండరాలు పట్టేస్తాయి.  పొట్ట కింద భాగంలో ఉండే అబ్డామినల్ కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఎలాగంటే అలా పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు నడుము నొప్పి రాకూడదు అంటే ఒక మంచి చిట్కా ఉంది. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే పడుకునే విధానం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా నడుము ఒత్తిడికి గురి కాదు. కుర్చీలో కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి. అంతే కానీ ఒకవైపుకు అనుకుని మూలకు కూర్చోకూడదు. అలాగే కుర్చీ నుండి లేచేతప్పుడు ఒకేసారి పైకి లేవకుండా  ఒక కాలిని ముందుకు, మరొక కాలిని వెనక్కు పెట్టి లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నడుమునొప్పి రాదు.  ఆడవారిలో ఈమధ్య బాగా విస్తృతం అయిపోయిన అలవాటు హై హీల్స్ వేసుకోవడం. ఇలా హైహీల్స్ వేసుకొంటే నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  చాలామంది  ఆడవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు రెండు కాళ్ళను ఇంటూ ఆకారంలో ఉంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  కాబట్టి ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. పైన చెప్పుకున్న కొన్ని చిట్కాలు గమనిస్తే మహిళలు తమకు తెలియకుండా నడుము నొప్పిన బారిన ఎలా పడుతున్నారో కూడా అర్థమవుతుంది. వాటికి సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పికి చెప్పచ్చు బై బై..                                      ◆నిశ్శబ్ద.