బొట్టుకూ ఓ లెక్కుంది.. ఇలా పెట్టుకుంటే కిక్కు ఉంటుంది!

బొట్టుకూ ఓ లెక్కుంది.. ఇలా పెట్టుకుంటే  కిక్కు ఉంటుంది!

ఆడవారి అందానికి బోలెడు అలంకారాలు. నుదుటన పెట్టుకునే బొట్టు నుండి కాళ్లకు వేసుకునే పట్టీల వరకు బోలెడు వైవిద్యాలు. కట్టు బొట్టు మహిళలకు అందం ఇవ్వాలన్నా, వారి అందంగా ఇనుమడింపచేయాలన్నా శరీరానికి తగిన దుస్తులు, రంగులు, బొట్టు వంటివన్నీ  చక్కగా ఎంపిక చేసుకోవాలి.  ముఖ్యంగా అమ్మాయిలు పెట్టుకునే బోట్టు వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ముఖం  ఆకారాన్ని బట్టి బొట్టు ఆకారం ఉండాలని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. ఎలాంటి ముఖం ఉన్నవారు ఎలాంటి బొట్టు పెట్టుకోవాలంటే..

వృత్తాకారం..

వృత్తాకారాన్నే రౌండ్ షేప్ అని అంటారు. రౌండ్ షేప్ ఉన్నవారు ముఖానికి ఎంపిక చేసుకునే బొట్టు రౌండ్ గా ఉండకూడదు.  ఇలాంటి వారికి చక్కగా పొడవుగా ఉన్న బొట్టు బిళ్లలు భలే ఉంటాయి.  ఇలాంటి బొట్టు పెట్టుకుంటే ముఖం లుక్ చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తుంది.

హృదయాకార ముఖం..

హృదయాకార ముఖాన్నే హార్ట్ షేప్  ఫేస్ అని కూడా అంటారు.  ఈ షేప్ ముఖం ఉన్నవారికి  నుదురు, గడ్డం ప్లాట్ గా ఉంటుంది.  ఇలాంటి ముఖ ఆకారం ఉన్నవారు  రౌండ్ షేప్ ఉన్న పెద్ద  బొట్టు పెట్టుకోకూడదు. దీని  వల్ల నదురు మరీ పెద్దగా కనిపిస్తుంది.  కాబట్టి  రౌండ్ షేప్ లోనే చిన్నగా ఉన్న బొట్టు పెట్టుకోవాలి.

డైమండ్ షేప్..

డైమండ్ షేప్ ముఖం  చిన్నగా ఉంటుంది. ఈ ఆకారం ఉన్నవారి ముఖం, గడ్డం షేప్ చక్కగా ఉంటుంది. వీరు ఎక్కువ డిజైన్ ఉన్న  ఉండే బొట్టు కాకుండా సింపుల్ గా ఉన్న బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది.

ఓవల్ షేప్..

ఓవల్ షేప్ ముఖాకృతి ఉన్నవారికి నుదురు, గడ్డం  పొడుగ్గా ఉంటాయి. ఇలాంటి వారికి రౌండ్ గా ఉన్న బొట్టు అయితే చాలా బాగుంటుంది.  గుండ్రని ఆకారంలో  ఉండే ఎలాంటి బొట్టు అయినా చూడ చక్కగా ఉంటుంది.

చతురస్రం షేప్..

కొంతమంది ముఖాకృతి చతురాస్రాకారంలో ఉంటుంది.  ఇలాంటి ముఖం ఉన్నవారు  అన్ని డిజైన్ల జోలికి వెళ్లకూడదు. ముఖం హైలెట్ గా కనిపించాలంటే రౌండ్ బొట్టు లేక చంద్రుడి ఆకారంలో   ఉన్న బొట్టు పెట్టుకోవచ్చు.  ఈ బొట్టు వల్ల ముఖం చూడటానికి చాలా అందంగా, ఆకర్షణగా ఉంటుంది.

స్టిక్కర్ హ్యాక్స్..

కేవలం బొట్టు ఆకారం విషయమే కాదు వాటి గురించి తెలుసుకోవలసిన చాలా విషయాలున్నాయి.  మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకోవడం ఫ్యాషన్ అని తెలిసిందే అయితే ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. డ్రస్ కలర్ మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకోవచ్చు. దీనివల్ల రూపం ఆకర్షణగా ఉంటుంది.  

ఎప్పుడూ ఒకే విధమైన స్టిక్కర్లు కాకుండా కొత్త కొత్తగా ట్రై చెయ్యాలి. అలా చేస్తే ట్రెండ్ ను ఫాలో అవ్వడం సులువు.

 స్టిక్కర్లు కొనుగోలు చేసేటప్పుడు పిచ్చి పిచ్చివి కొనకుండా బ్రాండ్ తీసుకోవాలి. దీనివల్ల స్టిక్కర్లు ఎక్కువ సేపు నుదిటిమీద ఉంటాయి.

స్టిక్కర్లు చాలామందికి మధ్యలోనే రాలిపడిపోతుంటాయి. ఇలా జరగకూడదు అంటే టాల్కమ్ పౌడర్ రాయాలి. దీన్ని రాయడం వల్ల స్టిక్ర్ రాలిపోదు. టాల్కమ్ పౌడరే కాదు.. కాంపాక్ట్ పౌడర్ కూడా రాసుకోవచ్చు. ఇలా చేసిన తరువాత స్టిక్కర్ ఎక్కువసేపు ఉంటుంది.

                                       *నిశ్శబ్ద.