పొట్టకొవ్వు కనిపంచకుండా కవర్ చేయాలంటే డ్రస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి!

పొట్టకొవ్వు కనిపంచకుండా కవర్ చేయాలంటే డ్రస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి!

స్లిమ్ గా కనిపించకూడదని అనుకునే అమ్మాయిలు బహుశా అరుదుగా ఉంటారు. కాలేజీ అమ్మాయిల నుండి పిల్లల తల్లుల వరకు తీరైన శరీర సౌష్టవం కోసం ఎంతో కష్టపడతారు. ఎన్ని డైట్ లు ఫాలో అయినా, ఎన్ని వర్కౌట్ లు చేసినా ఫలితం మాత్రం ఆశించిన విధంగా ఉండదు. అయితే వీటితో శరీరం ఫిట్ గా తయారు కాకుంటే ఆ తరువాత ఉన్న గొప్ప ఆప్షన్ డ్రస్సింగ్ స్టైల్. చాలావరకు శరీరంలో ఎబ్బెట్టుగా కనిపించేది, శరీర రూపాన్ని పాడుచేసేది, ఉన్నదానికంటే బరువున్నట్టు చూపెట్టేది పొట్ట. పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వు వల్ల వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ పొట్ట కొవ్వు కవర్ చేయడానికి మంచి డ్రస్సింగ్ స్టైల్ ఫాలో కావాలి. పొట్ట కొవ్వు ఉన్నవారు ఏ డ్రస్సులు ధరించకూడదో, ఎలాంటివి ధరించాలో తెలుసుకుంటే..

పొట్ట కొవ్వు ఉన్నవారు ఏ దుస్తులు ధరించాలంటే..

పొట్ట ఉన్న అమ్మాయిలు పొట్ట కవర్ కావడానికి నడుము పైభాగం వరకు ఉన్న జీన్స్ ధరించవచ్చు. దీనివల్ల పొట్ట ఉన్నట్టు అనిపించనే అనిపించదు. ఈ జీన్స్ వల్ల కేవలం పొట్ట కవర్ కావడమే కాదు పొట్టిగా ఉన్నవారు పొడవుగా కూడా కనబడతారు. ఫలితంగా లావుగా ఉన్నట్టు కూడా కనిపించరు.

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలలో గ్రాండ్ లుక్ కోసం లెహంగా, చీర లేదా సూట్ వంటివి ధరించాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది. కానీ పొట్ట కారణంగా ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. వీటిని ధరిస్తే లావుగా కనబడతారని అనుకుంటారు. పోనీ వీటిని నడుము పై భాగంలో ధరిద్దామా అనుకుంటే డ్రస్సింగ్ లుక్ మొత్తం పాడైపోతుంది. ఇందుకు బెస్ట్ ఆప్షన్ బాడీ షేపర్. బాడీ షేపర్ ధరించడం వల్ల  పొట్ట భాగం చాలా కవర్ అవుతుంది. బాడీ షేప్ చక్కగా కుదురుతుంది. అయితే బాడీ షేపర్ కొనుగోలు చేసేటప్పుడు పరిమాణం చూసుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున చిన్న సైజు బాడీ షేపర్ కొనుగోలు చేస్తే, దాన్ని ధరిస్తే లుక్ మొత్తం ఇంకా ఎబ్బెట్టుగా తయారవుతుంది.

స్లిమ్ గా కనిపించడానికి కుర్తా ధరించాలని అనుకునేవారు క్యాజువల్ వేర్ లో ప్లేర్డ్ కుర్తీలను ధరించవచ్చు. అలాగే వివాహ వేడుకలో కుర్తీ ధరించాలని అనుకుంటే అనార్కలీ డ్రస్ ను బాడీ షేపర్ మీద ధరించవచ్చు. ఈ రెండింటికీ కూడా మంచి పొంతన కుదురుతుంది.

పొట్ట కొవ్వును కవర్ చేయడానికి రఫిల్ చీర చాలా మంచి ఆప్షన్. ఈ చీర కట్టు పొట్ట కొవ్వును కవర్ సమర్థవంతంగా కవర్ చేస్తుంది. లుక్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.  ఈ చీరలోకి బెల్ స్లీవ్ లు ఉన్న బ్లౌజ్ లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్లీటెడ్ డిజైన్ పైన కూడా చీర ధరించవచ్చు . ఇది స్టైలిష్ లుక్ ను మాత్రమే కాదు పొట్ట కొవ్వును కూడా దాచిపెడుతుంది.

పొట్ట ఉన్న అమ్మాయిలు ఈ దుస్తులు మాత్రం ధరించకూడదు..

పొట్ట కొవ్వు  అధికంగా ఉండి పొట్ట పైకి కనబడుతూ ఉంటే చీర, లెహంగా మొదలైనవి బాడీ షేపర్ లేకుండా  ధరించే సాహసం చేయకండి.  బిగుతుగా  ఉన్న దుస్తులు, వేడి గుణం కలిగిన దుస్తులు  ధరిస్తే లావుగా, పొట్ట ఉన్నవారు మరింత ఎబ్బెట్టుగా కనిపిస్తారు. కాబట్టి వీలైన వరకు బిగుతు దుస్తులకు దూరంగా ఉండటమే మంచిది.

పొట్ట పైకి కనిపస్తూ ఉంటే నడుము కిందకు వేసుకునే జీన్స్ ధరంచకూడదు. ఇది పొట్టను హైలెట్ చేసి చూపిస్తుంది. పొరపాటున కూడా బాడీకాన్ దుస్తులు ధరించకూడదు.

                                                           *నిశ్శబ్ద.