![]() |
![]() |

బాక్సాఫీస్ దగ్గర మెగా జాతర జరుగుతోంది. చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 'ఆచార్య' ఘోర పరాజయం, 'గాడ్ ఫాదర్' ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో మెగాస్టార్ బాక్సాఫీస్ రేంజ్ తగ్గిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ కామెంట్స్ కి కలెక్షన్లతోనే సమాధానం చెబుతున్నాడు చిరు. నిజానికి 'వాల్తేరు వీరయ్య' కూడా విడుదల రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం అంచనాలకు మించి వస్తున్నాయి. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల గ్రాస్ రాబట్టిందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.22.90 కోట్ల షేర్, రెండో రోజు రూ.11.95 కోట్ల షేర్, మూడో రోజు రూ.12.61 కోట్ల షేర్ రాబట్టిన 'వాల్తేరు వీరయ్య'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.47.46 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే ఇప్పటిదాకా నైజాంలో రూ.16.16 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.9.16 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.22.14 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.3.90 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.7.55 కోట్ల షేర్ తో మూడు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.58.91 కోట్ల షేర్ తో సత్తా చాటింది.
ఓవరాల్ గా రూ.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన వాల్తేరు వీరయ్య.. రూ.89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మూడు రోజుల్లోనే 66 శాతం రికవరీ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 30 కోట్ల దూరంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలు పొందే అవకాశముంది.
![]() |
![]() |