రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ తాను బోల్డ్ అని నిరూపించుకుంటోంది పాయల్ రాజ్‌పుత్. టాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రంం ఆర్ఎక్స్ 100లో బోల్డ్ సీన్స్‌తో సంచలనం సృష్టించిన ఈ తార ఇప్పుడు చేసిన ఓ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ అందర్నీ షాక్‌కు గురిచేసింది. పేరుపొందిన ఓ బ్రాండ్ విస్కీని ఆమె ప్రమోట్ చేస్తోంది.
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ పిక్చర్‌లో పాయల్ చేతిలో గ్లాస్, ఆ గ్లాస్‌లో విస్కీ ఉన్నాయి. కింద టేబుల్‌పై పేరు పొందిన బ్రాండ్ విస్కీ బాటిల్ కనిపిస్తోంది. తెలంగాణలో అందుబాటులో ఉన్న ఈ విస్కీ చాలా స్మూత్‌గా, రిచ్‌గా ఉందని క్యాప్షన్ ద్వారా తెలియజేసింది. యాక్టర్లలో మద్యం తాగని వాళ్లను వేళ్లమీద లెక్కించవచ్చు. అయితే ఆ తాగేవాళ్లెవరూ పబ్లిగ్గా తాము ఏ మద్యం తాగుతామో చెప్పలేదు. ఏ బ్రాండ్‌ను ఏవరూ ఇంతదాకా ప్రమోట్ చేయలేదు.
ఆడవాళ్లు మద్యానికి దూరంగా ఉంటారనేది సాధారణాభిప్రాయం. అయితే చాలామంది లేడీ ఆర్టిస్టులు మద్యానికి బానిసలని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పడు పాయల్ దాన్ని నిజమని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేస్తోంది. మొత్తానికి సందీప్ కిషన్, నిఖిల్ లాంటి మేల్ ఆర్టిస్టులు లిక్కర్ బ్రాండ్ సోడాలకు అంబాసిడర్స్‌గా కనిపించడం చూశాం కానీ, ఓ టాలీవుడ్ హీరోయిన్ నేరుగా విస్కీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా కనిపించడం ఇదే ప్రథమం.