సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం దుబాయ్‌లో వైఫ్ నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. ఇదివరకు ఆయన ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' స్టార్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫ్యామిలీతో కలిసి తాము బసచేసిన హోటల్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న స్టన్నింగ్ పిక్చర్‌ను షేర్ చేశారు. ఆ పిక్చర్‌కు "Dinner with the gang!!' అనే క్యాప్షన్‌తో పాటు మూడు రెడ్ హార్ట్ ఎమోటికాన్స్‌ను జోడించారు. అలాగే #familytime #bonappetit అనే హ్యాష్‌ట్యాగ్స్ కూడా పెట్టారు. ఈ పిక్చర్లో ఆయనతో పాటు పిల్లలు గౌతమ్, సితార ఉన్నారు కానీ ఆయన భార్య నమ్రత మిస్సయ్యారు. ఎందుకంటే ఈ ఫొటో తీసింది ఆమే కాబట్టి.
అంతకు ముందు నమ్రతా శిరోద్కర్ ఇదే డిన్నర్‌కు సంబంధించిన మరో బ్యూటిఫుల్ పిక్చర్‌ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. "Dinner date done right NETSU! You have my heart #traveldiaries #timeout @urstrulymahesh @gautamghattamaneni @sitaraghattamaneni." అనే క్యాప్షన్ పెట్టారామె.
వర్క్ విషయానికి వస్తే, మహేశ్ త్వరలో 'సర్కారు వారి పాట' షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించే ఈ సినిమాకు పరశురామ్ డైరెక్టర్. జనవరిలో ఈ మూవీ షూట్ కోసం వారు యు.ఎస్. వెళ్లనున్నారు. ఈలోగా ఫ్యామిలీతో కలిసి జాలీగా రోజులు ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్.