![]() |
![]() |
శ్రీరామునిగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ ఇదివరకు అజయ్ దేవ్‌గణ్ టైటిల్ రోల్ పోషించగా బ్లాక్‌బస్టర్ హిట్టయిన 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్' మూవీతో వెలుగులోకి వచ్చాడు. 'ఆదిపురుష్'కు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్, 'జై శ్రీరాం' పాట.. సినిమాపై చెప్పుకోదగ్గ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి.
ఈనెల 6న తిరుపతి పుణ్యక్షేత్రంలో 'ఆదిపురుష్' ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేదికపై మూవీ రెండో ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. దీనిపై నిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటనా ఇంతదాకా రాలేదు.
ప్రస్తుత అంచనాల ప్రకారం 'ఆదిపురుష్' ఓపెనింగ్స్ అసాధారణ స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. తెలుగు, హిందీ వెర్షన్లు భారీ వసూళ్లు సాధిస్తాయని వారు నమ్ముతున్నారు. రాముని రూపంలో ప్రభాస్ కనిపిస్తున్న తీరు అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. లక్ష్మణునిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవ్‌దత్ నాగే నటించిన ఈ సినిమాని ట్-సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫిలిస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
![]() |
![]() |