అక్షయ్ కుమార్ సరసన కియారా అద్వానీ నటించిన బాలీవుడ్ సినిమా 'లక్ష్మీబాంబ్'. సౌత్‌లో సూపర్ హిట్ అయిన 'కాంచన'కి రీమేక్. 'కాంచన' హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హిందీలో 'లక్ష్మీ బాంబ్'కి డైరెక్షన్ చేశాడు. ఆ సినిమా టైమ్‌లో కియారా అద్వానీని 'చంద్రముఖి 2'లో నటించమని రిక్వెస్ట్ చేయగా, ఆమె యాక్సెప్ట్ చేసిందని చెన్నైలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, క్యాస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదని లారెన్స్ స్పష్టం చేశాడు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'లకలకలకలక' అంటూ నట విశ్వరూపం చూపించిన సినిమా 'చంద్రముఖి'. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. అందులో రజనీ నటించడం లేదు. ఆయన వీరాభిమాని రాఘవా లారెన్స్ హీరో. సినిమా ఓకే చేసే ముందు రజనీ బ్లెస్సింగ్ తీసుకున్నాడు. డైరెక్టర్ మాత్రం సేమ్. 'చంద్రముఖి 2'కి కూడా పి. వాసు డైరెక్టర్.
"అసలు సినిమా స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదు. లాక్ డౌన్ నుండి దర్శకుడు వారుగారిని కలవలేదు. మేం ఏదీ డిస్కస్ చేసుకోలేదు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ సిట్యువేషన్ చూస్తే 'చంద్రముఖి 2'కి ఎంత బడ్జెట్ అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతానికి కాస్టింగ్ గురించి ఆలోచించడం లేదు" అని రాఘవా లారెన్స్ క్లియర్ గా చెప్పారు.