సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం రిపోర్టులో సూసైడ్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే, అతడి మృతికి బాలీవుడ్లో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్, ఏక్తా కపూర్ తదితరులు కారణమని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి వాళ్ళపై కేసులు పెట్టారు. షాకింగ్ ఏంటంటే... సుశాంత్ సూసైడ్‌కి అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని అతడి తండ్రి కె.కె. సింగ్ కేసు పెట్టడం!
బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో రియా చక్రవర్తిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కె.కె. సింగ్ కేసు పెట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంగతిని పాట్నా సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ ధృవీకరించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిసింది. సుశాంత్ ఆత్మహత్యకు ఆమె ప్రేరేపించిందని ఫిర్యాదులో కె.కె. సింగ్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌గా ఛీట్ చేసిందనీ ఆయన అన్నారు. అందువల్ల, తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కె.కె. సింగ్ అన్నారట. రియాతో పాటు మరో ఐదుగురిపై కేసు పెట్టారట.