‘ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది.
ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది.’
– ఇది ‘కంచె’ టీజర్‌లో డైలాగ్.
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కంచె’. అందులో వరుణ్‌తేజ్‌ది సైనికుడి పాత్ర. ప్రేమ నేపథ్యంలో యుద్ధానికి ముడిపెడుతూ క్రిష్ చక్కటి సినిమా రూపొందించారు. అందులో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. యుద్ధం, ప్రేమ మేళవించిన సినిమా అంటే ఇటీవల వచ్చిన సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు ‘కంచె’ గుర్తొస్తుంది.
కట్ చేస్తే... దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తున్న సినిమా అనౌన్స్ చేశారు. అందులో హీరోది లెఫ్టినెంట్ కార్టెకర్ అన్నమాట. ప్రీలుక్‌తో పాటు ‘యుద్ధం’తో రాసిన ప్రేమకథ అని ట్యాగ్‌లైన్ పెట్టారు. ఆర్మీ నేపథ్యంలో ప్రేమకథా చిత్రం అనేసరికి ‘కంచెలా ఉంటుందా?’ అని ఆడియన్స్ అంటున్నారు. వాళ్ళకు క్రిష్ ‘కంచె’ గుర్తుకు వస్తోంది. ప్రీలుక్ చూసి సినిమాపై అంచనాకు రావడం పొరపాటే. సినిమా వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది.