ఇండియా టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళిని ఒక విషయంలో తాను ఇరికించినట్లు నటి, టెలివిజన్ ప్రెజెంటర్ లక్ష్మీ మంచు చెప్పారు. త్వరలో ఆమె 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు' అనే డిజిటల్ చాట్ షోతో మన ముందుకు రాబోతున్నారు. అందులోని ఓ ఎపిసోడ్లలో ఒక దానిలో రాజమౌళి గెస్ట్‌గా కనిపించనున్నారు.
"రాజమౌళి గారు గెస్ట్‌గా వచ్చే ఒక ఎపిసోడ్ ఉంది. ఫన్ కోసం, ఒక ఫిల్మ్ కోసం ఒక నిమిషం సీన్‌ను తీసివ్వమని రాజమౌళి సర్‌ను అడిగాను. ఆ తర్వాత 'ఇప్పుడు మీ టైమ్ స్టార్ట్ అయ్యింది' అని చెప్పాను. ఆయన గట్టిగా నవ్వి, 'నేను ఏ రకంగానూ స్పాంటేనియస్ పర్సన్‌ని కాను. నన్ను ఇరికించాలని మీరు చూస్తున్నారని అనుకుంటున్నా' అని అన్నారు. ఆయనలాంటి ఐకానిక్ డైరెక్టర్ నాతో అలా అన్నారు. 'బాహుబలి' లాంటి మ్యాజిక్‌ను డెలివర్ చేయడానికి రెండు సినిమాల కోసం ఆయన ఐదు సంవత్సరాల సమయం తీసుకోవడం ఆశ్చర్యకరమేమీ" కాదు అని చెప్పారు లక్ష్మి.
ఆమె చాట్ షోలో తాప్సీ పన్ను, సానియా మీర్జా, ప్రకాశ్ అమృతరాజ్, అమెరికన్ ఫిల్మ్‌మేకర్ ఫ్రాంక్ కొరాసి లాంటి వాళ్లు గెస్ట్‌లుగా కనిపించనున్నారు.