![]() |
![]() |

జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న నాయికల్లో తమన్నా ఒకరు. పదిహేనుళ్ళుగా దక్షిణాదిన హీరోయిన్ గా రాణిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ఇటీవల కాలంలో సీక్వెల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. రెండేళ్లకో సీక్వెల్ మూవీతో సందడి చేస్తోందీ అమ్మడు.
ఆ వివరాల్లోకి వెళితే.. 2017లో బాహుబలి - ది బిగినింగ్ కి కొనసాగింపుగా తెరకెక్కిన బాహుబలి - ది కంక్లూజన్ తో పలకరించిన తమన్నా.. 2019లో అభినేత్రికి సీక్వెల్ గా తెరకెక్కిన అభినేత్రి 2తో సందడి చేసింది. ఇప్పుడు ఇదే వరుసలో 2021లో ఎఫ్ 2కి సీక్వెల్ గా రూపొందుతున్న ఎఫ్ 3తో వెండితెరపై వెలుగులు పంచనుంది. మరి.. ఈ సీక్వెల్ తమన్నా కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
ఈ రోజే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఎఫ్ 3.. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. సీక్వెల్ లోనూ విక్టరీ వెంకటేష్ కి జోడీగా తమన్నా కనిపించనుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ లో మరో జంటగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ నటిస్తున్నారు. 2021 వేసవిలో ఎఫ్ 3 సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
![]() |
![]() |