"మీకు ఒక ఆడది నచ్చకపోతే 'ల...జ' నా?" అని చిన్మయి సూటిగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మహిళల హక్కులకు సంబంధించిన పోస్టులు ఆమె చేస్తుంటారు. ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ చిన్మయి మీద విమర్శలు చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు కింద 'raju__420' పేరుతో ఉన్న ఒక ఐడీ నుండి చిన్మయిని రాయలేని భాషలో తిట్టారు. అందుకు ఆమె ధీటైన జవాబు ఇచ్చారు.
"మీలాంటి తెలుగు అబ్బాయిలకు నేను నచ్చకపోతే ప్రాబ్లమ్ లేదు. నేను నచ్చాలని పడి ఏడవడం లేదు. కానీ, అదేం పెంపకం రా మీది? వెంటనే 'ల...జ' అంటారు. మీకు ఒక ఆడది నచ్చకపోతే 'ల...జ' నా? మీలాంటి మగాళ్లకు ఫెమినిజం ఎలా అర్థం అవుతుంది? అర్థం కాదు కదా:) అందుకే, ఇంత కోపం వస్తుంది. కానీ, ఫర్వాలేదు. ఒక 5-10 ఏళ్లలో కట్నం ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉండేలా అమ్మాయిలు శక్తివంతంగా మారతారు. అప్పటివరకు మేం శక్తిని పొందుతాం" అని చిన్మయి పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఈ పోస్ట్ చేశారు.