Home  »  News  »  మహిళే మద్దతు ఇవ్వాలా? మగాళ్ళూ మద్దతు ఇవ్వవచ్చు!

Updated : Jul 30, 2020

"మద్దతు ఇవ్వడానికి నువ్వే మహిళే అవ్వాల్సిన అవసరం లేదు" అని 'కృష్ణ అండ్ హిజ్ లీల' హీరో సిద్ధూ జొన్నలగడ్డ అన్నారు. ఈ మాటకు ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో జత చేశారు. ఇప్పుడు తనకు అదేంటో తెలిసిందని అర్థం వచ్చేలా ఒక హ్యాష్ టాగ్ కూడా యాడ్ చేశారు.  

ప్రజెంట్ సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఛాలెంజ్ ఒకటి నడుస్తోంది. అయితే, చాలామందికి ఈ ఛాలెంజ్ ఏంటో తెలియదు. ఇది బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీ ఛాలెంజ్ కాదు. టర్కీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతికరేకంగా మొదలైన సోషల్ మీడియా ఉద్యమం అని కొందరు చెబుతున్నారు. మగాళ్ల చేతిలో హత్యకు గురైన మహిళల ఫొటోలను టర్కీ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తున్నారట. ఆ వివక్షకు నిరసనగా ఈ ఉద్యమం మొదలైందట. ఇండియాలోనూ చాలామంది సెలబ్రిటీలు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఉద్యమానికి సిద్ధూ జొన్నలగడ్డ కూడా మద్దతు పలికారు. 

 

 

ఓ మహిళకు మద్దతు ఇవ్వడానికి మహిళే అవ్వాల్సిన అవసరం లేదని  తన పోస్ట్ ద్వారా సిద్ధూ జొన్నలగడ్డ అందరికీ చెప్పారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.