లాక్డౌన్లో ప్రేక్షకుల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవాలని అనసూయ అనుకున్నారు. 'వాట్సాప్?' అంటూ ఇన్స్టాలో నెటిజన్లను పలకరించారు. విశ్రాంతి తీసుకుంటూ మీ ఆలోచనలు, అభిప్రాయాలు చెప్పమని అడిగారు. అందుకు ఓ నెటిజన్ 'ఉద్యోగాలు లేనివాళ్ల కష్టాలు మీకు ఏం తెలుసు మేడమ్?' అని వెటకారంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అనసూయ ఏమీ తక్కువ తినలేదు. అంతే వెటకారంగా రిప్లై ఇచ్చారు.
"ఛా...!! మీకు పని లేనప్పుడు సగం జీతాలు ఇచ్చి చూసుకున్నారు. మిమ్మల్ని మరి! మేమంటే మీకు ఇంత లోకువ ఏంటి సార్??" అని అనసూయ అన్నారు. లాక్డౌన్ టైమ్లో ఆఫీసులకు రావడం వీలుకాని కొందరికి కొన్ని కంపెనీలు సగం జీతాలు ఇచ్చాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అప్పుడు సినిమా ఇండస్ట్రీ షాట్ డౌన్ మోడ్లో ఉంది. షూటింగులు జరగకపోవడంతో నటీనటులు, యాంకర్లు, టెక్నీషియన్లకు డబ్బులు రాలేదు. అనసూయ ఆ విషయాన్ని ఇలా చెప్పారన్నమాట.