టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ అన్నా, బలమైన హీరోయిన్ క్యారెక్టర్ అన్నా మొదట గుర్తొచ్చే పేరు అనుష్క. అలాంటి పవర్‌ఫుల్ రోల్స్‌ను ఆమె చేసింది. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన (బాహుబలి), భాగమతి వంటి పాత్రలతో ఆమె సూపర్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్‌కైనా విమెన్ సెంట్రిక్ సినిమా అంటే ఫస్ట్ చాయిస్ ఆమే.
రానున్న సినిమాలోనూ ఆమె అలాంటి శక్తిమంతమైన క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. అది.. 'నిశ్శబ్దం'. అందులో ఆమె మూగ చిత్రకారిణి అని సాక్షి అనే పాత్రను చేసింది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని రైటన్ కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆమెకు జోడీగా మాధవన్ నటించగా, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు చేశారు. కరోనా కేసులు తగ్గి, థియేటర్లు ఓపెన్ కాగానే ఈ మూవీ విడుదల కానుంది.
అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలమైంది. దేవసేన పాత్రకు దేశవ్యాప్తంగా వచ్చిన ఇమేజ్‌తో పాత్రల విషయంలో ఆమె మరింత శ్రద్ధ వహిస్తోంది. అందుకు నిదర్శనం.. 'భాగమతి' మూవీ. 'నిశ్శబ్దం' కాకుండా ఆమె మరే ఇతర సినిమానూ ఒప్పుకోకపోవడానికి కారణం.. త్వరలో ఆమె పెళ్లాడనున్నదనే ప్రచారం. అయినప్పటికీ లేటెస్ట్‌గా ఆమె కమల్ హాసన్ 'వేట్టయ్యాడు విలయ్యాడు' (తెలుగు 'రాఘవన్') మూవీ సీక్వెల్‌లో నటించనున్నట్లు వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారమైతే లేదు.
38 సంవత్సరాల అనుష్క జీవితంలో స్థిరపడితే చూడాలని ఉందని ఆమెను అరుంధతిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన స్టార్ ప్రొడ్యూసర్ ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వంటివాళ్లు ఆకాంక్షిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకొనే ఉద్దేశంతోనే కొత్త ఆఫర్లను ఆమె యాక్సెప్ట్ చేయడం లేదనేది కరెక్ట్ కాదని ఫిల్మ్‌నగర్ జనాలు అంటున్నారు. ఆమె ఏ ఎన్నారైనో పెళ్లి చేసుకొని, టాలీవుడ్‌కు దూరంగా వెళ్లిపోతే తప్ప, సినిమాలు చేస్తూనే ఉంటుందనేది వారి మాట. అయితే బలమైన పాత్రలు, తన నటనకు సవాలు విసిరే పాత్రల కోసమే ఆమె వెయిట్ చేస్తోందని వాళ్లు చెప్తున్నారు. అందులో నిజం ఉంది.