![]() |
![]() |

అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ 4 విన్నర్ ట్రోఫీని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజీత్ ఎగరేసుకుపోయాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా అతను ట్రోఫీని అందుకుని, ఉద్వేగంతో ఊగిపోయాడు. చిరుకు పాదాభివందనం చేశాడు. కలలో కూడా ఈ క్షణాలను ఊహించలేదన్నాడు. ఇద్దరు టాప్ 2 కంటెస్టెంట్లను చెరోవైపు పట్టుకొని, అఖిల్ చేతిని కిందకు దించి, అభి చేతిని నాగ్ పైకెత్తగానే ఆ స్టేజ్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లు, వారి ఫ్యామిలీస్, ఆడియెన్స్ కేరింతలతో సందడి చేశారు.
ఎక్కడో గల్లీలో ఉండే తనకు బిగ్ బాస్ చాలా పేరు తెచ్చిందనీ, తాను ఇక్కడి దాకా రావడం చాలా గొప్పగా ఫీలవుతున్నాననీ రన్నరప్ అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ చాలా విషయాలు నేర్పుతుందనీ, వాటిని జీవితంలో అప్లై చేస్తూ, ఫ్యూచర్‌లో ఎదగాలనీ చిరంజీవి ఆకాంక్షించారు. బిగ్ బాస్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్లందరూ విజేతలేనని అభిజీత్ వాళ్లమ్మ చెప్పడం ఆకట్టుకుంది. అలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ సక్సెస్‌గా ముగిసింది.

![]() |
![]() |