![]() |
![]() |

105 రోజులుగా టీవీ వీక్షకులను అమితంగా అలరిస్తూ వస్తోన్న బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలే గ్రాండ్‌గా జరుగుతోంది. ఐదుగురు ఫైనలిస్టుల్లో చివరకు పోటీలో అభిజీత్, అఖిల్ మిగిలారు. మొదటగా దేత్తడి హారిక, తర్వాత అరియానా ఎలిమినేట్ అవగా, టాప్ 3లో రూ. 25 లక్షల సూట్‌కేస్ పట్టుకొని హౌస్ నుంచి బయటకు వచ్చాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సొహేల్. అలా అభిజీత్, అఖిల్ ప్రత్యర్థులుగా మిగిలారు.
టాప్ 5లో ఒకర్ని ఎలిమినేట్ చేయడానికి హోస్ట్ నాగార్జున ఇద్దర్ని హౌస్‌లోకి పంపించారు. ఒకరు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాగా, మరొకరు ఎఫ్ 2 హీరోయిన్ మెహ్రీన్. అనిల్ తన టాలెంట్ చూపిస్తూ నవ్వించగా, హారిక ఎలిమినేట్ అవుతున్నట్లు మెహ్రీన్ ఆమెను క్రేన్‌లో కూర్చోపెట్టింది. తాను ఎలిమినేట్ అవుతున్నానని తెలిసినా హారిక ఆ బాధ ఏమీ బయటకు వ్యక్తం చేయకుండా, స్పోర్టివ్‌గా నవ్వుతూ బయటకు వచ్చింది.
టాప్ 4 కంటెస్టెంట్‌గా అరియానా హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆమెను లక్ష్మీ రాయ్ బయటకు తీసుకొచ్చింది. అంతకు ముందు ప్రణీత రూ. 10 లక్షలు ఆఫర్ ఇచ్చినా ఎవరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు.
ఆ తర్వాత బరిలో ముగ్గురు.. అభిజీత్, అఖిల్, సొహేల్ నిలిచారు. హౌస్‌లోకి ఓ గోల్డ్ కలర్ సూట్‌కేస్‌ను పంపించారు. అందులో మొదట రూ. 20 లక్షలు ఉన్నాయనీ, ఎవరైనా దాన్ని తీసుకొని బయటకు రావచ్చని నాగార్జున ప్రకటించారు. ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. దాంతో అందులో ఉన్నది రూ. 25 లక్షలని ఎనౌన్స్ చేశారు. అనాథాశ్రమానికి తాను రూ. 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నానని, రూ. 25 లక్షలు వస్తే, అది తనకు ఉపయోగపడుతుందని చెప్పి, ఆ గోల్డ్ బాక్స్ తీసుకొని బయటకు వచ్చేశాడు సొహేల్.
దాంతో విన్నర్స్ ట్రోఫీ బరిలో అభిజీత్, అఖిల్ నిలిచారు. వారిలో ఒకరిని విజేతగా ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.
![]() |
![]() |